అడవిలో క్రూర మృగాలుంటాయి. ఆకలేస్తేనే గుహలోంచి బయటికి వస్తాయి. దొరికిన ఒకటి ఆరా జంతువుల్ని తిని తిరిగి గుహలోకి వెళ్లిపోతాయి.
ఆ గిరిజన యువతికి తెలిసిన విషయం అది. ఆమె పట్టుదలగా, తన తాతయ్య పట్టుదల ఆలంబనగా చదివింది. ఐ. ఏ. యస్. లో ఉత్తీర్ణత సాధించింది. ఇప్పుడేమో కలెక్టరుగా ఒక జిల్లాకు అపాయింట్మెంట్ సాధించింది.
ఆమె ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. 'లా అండ్ ఆర్డర్' 'పంపిణి వ్యవస్థ' మెరుగైన పాలన....
కానీ ఆమె గ్రహించింది అవేమీ తన చేతులలో లేవని. ఇది ఒక జనార్యనమని ఇక్కడ మృగాల కంటే భయంకరమైన మానవ మృగాలున్నాయని.
- బొల్లిముంత నాగేశ్వరరావు