'నవలలన్నీ దేశాల అనధికారిక చరిత్రలే' అన్న ఫ్రెంచి రచయిత బాల్జాక్ వాక్యం ఈ నవలకు ప్రేరణ. పెరూ దేశ అనధికార చరిత్ర రాయాలనుకున్నాడు జోసా. చరిత్ర అనుకున్నాక, మరి పుస్తకం సైజు కూడా పెరగక తప్పదు. ఉన్నవాళ్లకూ, లేనివాళ్లకూ మధ్య పోరాటం ఈనాటిది కాదు. ఈ రెండు వర్గాల సామాజిక పరిణామ క్రమాన్ని వివరించడంతో ఓ పట్టాన కొలిక్కిరాని కథ, టీవీ సీరియల్ను తలపిస్తుంది.
అనుకోకుండా ఒకరోజు సాంటియాగోకు వీధిలో తారసపడతాడు ఆంబ్రోసియో. ఇద్దరూ కలిసి పేదవాళ్ల 'దాహార్తి'ని తీర్చే 'ది కెథడ్రల్' బార్లో కబుర్లు చెప్పుకుంటారు. అవును, ఆ కబుర్లే కథ. అలా ప్రారంభమవుతుంది దేశ చరిత్ర, సాంటియాగోకు భార్యతో తృప్తి లేదు. ఎక్కడో పొరబాటు జరిగింది. మంచి ఉద్యోగమే వుంది. సంసారం ఒడుదుడు కుల్లో లేదు. అంతా సజావుగానే సాగిపోతున్నది. ఆమెను తప్పుపట్టవలసిన అవసరం లేదు. వెరసి మధ్యతరగతి కుటుంబం. చెప్పుకోవలసిన కష్టాలు లేవు. ఆరువందల పేజీల తర్వాత కూడా పరిస్థితి మారదు. అయితే, సాంటియాగో, ఆంబ్రోసియో, మరికొందరు పాత్రలు గురించి మరింత లోతుగా తెలుస్తుంది. సాంటియాగోను వేధిస్తున్న సమస్య ఏమిటో అర్థమవుతుంది. మార్పులేదు, ఆశలేదు, కాలం భారంగా గడిచిపోయింది. ఇకముందూ ఇంతే! అవినీతి, సామాజిక అసమానతలూ పెరూవియన్ సమాజానికి పట్టిన పీడ. వీటిని నిర్మూలించనంత వరకూ ఈ పరిస్థితి ఇంతే............
'నవలలన్నీ దేశాల అనధికారిక చరిత్రలే' అన్న ఫ్రెంచి రచయిత బాల్జాక్ వాక్యం ఈ నవలకు ప్రేరణ. పెరూ దేశ అనధికార చరిత్ర రాయాలనుకున్నాడు జోసా. చరిత్ర అనుకున్నాక, మరి పుస్తకం సైజు కూడా పెరగక తప్పదు. ఉన్నవాళ్లకూ, లేనివాళ్లకూ మధ్య పోరాటం ఈనాటిది కాదు. ఈ రెండు వర్గాల సామాజిక పరిణామ క్రమాన్ని వివరించడంతో ఓ పట్టాన కొలిక్కిరాని కథ, టీవీ సీరియల్ను తలపిస్తుంది. అనుకోకుండా ఒకరోజు సాంటియాగోకు వీధిలో తారసపడతాడు ఆంబ్రోసియో. ఇద్దరూ కలిసి పేదవాళ్ల 'దాహార్తి'ని తీర్చే 'ది కెథడ్రల్' బార్లో కబుర్లు చెప్పుకుంటారు. అవును, ఆ కబుర్లే కథ. అలా ప్రారంభమవుతుంది దేశ చరిత్ర, సాంటియాగోకు భార్యతో తృప్తి లేదు. ఎక్కడో పొరబాటు జరిగింది. మంచి ఉద్యోగమే వుంది. సంసారం ఒడుదుడు కుల్లో లేదు. అంతా సజావుగానే సాగిపోతున్నది. ఆమెను తప్పుపట్టవలసిన అవసరం లేదు. వెరసి మధ్యతరగతి కుటుంబం. చెప్పుకోవలసిన కష్టాలు లేవు. ఆరువందల పేజీల తర్వాత కూడా పరిస్థితి మారదు. అయితే, సాంటియాగో, ఆంబ్రోసియో, మరికొందరు పాత్రలు గురించి మరింత లోతుగా తెలుస్తుంది. సాంటియాగోను వేధిస్తున్న సమస్య ఏమిటో అర్థమవుతుంది. మార్పులేదు, ఆశలేదు, కాలం భారంగా గడిచిపోయింది. ఇకముందూ ఇంతే! అవినీతి, సామాజిక అసమానతలూ పెరూవియన్ సమాజానికి పట్టిన పీడ. వీటిని నిర్మూలించనంత వరకూ ఈ పరిస్థితి ఇంతే............© 2017,www.logili.com All Rights Reserved.