నీల స్వేచ్చని మాత్రమే కాదు, సాహచర్యాన్ని కూడా కోరుకుంది. తన జీవితంలో వరసగా ప్రవేశించిన ముగ్గురు పురుషులు - ప్రసాద్, పరదేశి, సదాశివలతో ఆమె ప్రతిసారీ కోరుకున్నది సాహచర్యాన్నే. నిజమైన సాహచర్యాన్ని. తాను వాళ్ళతో ఏమి కోరుకుంటున్నదో తెలుసుకోవడానికి తన చుట్టూ ఉన్న స్త్రీ పురుష సంబంధాల్లో ఏది లేదో తెలుసుకుంటూ వచ్చింది. తన తల్లి, సంపూర్ణ, అజిత, నీతాభాయి, వసుంధర వంటి వాళ్ళందర్నీ దగ్గర్నుంచి చూశాక ఆమెకి తెలుస్తూ వచ్చిందేమంటే, జీవితానందానికి స్వేచ్చ కావాలి. కాని, స్వాతంత్ర్యం లేకపోవడం ఎంత ప్రమాదకరమో, సాహచర్య సంతోషాన్ని భగ్నం చేసే స్వేచ్చ కూడా అంతే ప్రమాదకరమని.
- వాడ్రేవు చినవీరభద్రుడు
తన అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, తానెంచుకొన్న గమ్యాన్ని చేరిన ఒక యువతి కథ నీల నవల. బలీయమైన ప్రేమ, స్వేచ్చకి సంకెలగా పరిణమించిన సంఘర్షణాత్మక సందర్భాల్లో క్లేశాన్ని అధిగమిస్తూ, చిక్కుముడులు విప్పుకుంటూ ఆ రెంటి మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నించిన స్త్రీ జీవిత శకలం.
తొలినాళ్ళలో నీల జీవితానికి నిశ్చితమైన నిర్దిష్ట గమ్యాల్లేవు. ఆమె జీవితం ఆమె చేతుల్లో లేదు. ఆమెకి తెలియకుండానే జారిపోయినదాన్ని వొడిసి పట్టుకుని తనకు నచ్చిన రీతిలో దిద్దుకొనే క్రమంలోనే తనను తాను తెలుసుకోగలిగింది. చదువుకొంది. సొంత కాళ్ల మీద నిలబడింది. తనని బాధించే హక్కు ఎవరికీ లేదు. అదే సమయంలో తాను ఎవరి బాధకీ కారణం కాకూడదు అన్నదే ఆమె తన జీవితతత్త్వంగా మార్చుకొంది. ఒక విధంగా నీల స్వీయ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్చ కోసం చేసిన పెనుగులాటే ఆమె గమనం. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. 'ఆడా మగా సంబంధాల్లో సార్వకాలికమైన సార్వజనీనమైన విలువలేమీ ఉండవని,' తెలుసుకుంది. భయాల సంకెళ్లు తెంచుకుంది.
- ఎ కె ప్రభాకర్
నీల స్వేచ్చని మాత్రమే కాదు, సాహచర్యాన్ని కూడా కోరుకుంది. తన జీవితంలో వరసగా ప్రవేశించిన ముగ్గురు పురుషులు - ప్రసాద్, పరదేశి, సదాశివలతో ఆమె ప్రతిసారీ కోరుకున్నది సాహచర్యాన్నే. నిజమైన సాహచర్యాన్ని. తాను వాళ్ళతో ఏమి కోరుకుంటున్నదో తెలుసుకోవడానికి తన చుట్టూ ఉన్న స్త్రీ పురుష సంబంధాల్లో ఏది లేదో తెలుసుకుంటూ వచ్చింది. తన తల్లి, సంపూర్ణ, అజిత, నీతాభాయి, వసుంధర వంటి వాళ్ళందర్నీ దగ్గర్నుంచి చూశాక ఆమెకి తెలుస్తూ వచ్చిందేమంటే, జీవితానందానికి స్వేచ్చ కావాలి. కాని, స్వాతంత్ర్యం లేకపోవడం ఎంత ప్రమాదకరమో, సాహచర్య సంతోషాన్ని భగ్నం చేసే స్వేచ్చ కూడా అంతే ప్రమాదకరమని. - వాడ్రేవు చినవీరభద్రుడు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, తానెంచుకొన్న గమ్యాన్ని చేరిన ఒక యువతి కథ నీల నవల. బలీయమైన ప్రేమ, స్వేచ్చకి సంకెలగా పరిణమించిన సంఘర్షణాత్మక సందర్భాల్లో క్లేశాన్ని అధిగమిస్తూ, చిక్కుముడులు విప్పుకుంటూ ఆ రెంటి మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నించిన స్త్రీ జీవిత శకలం. తొలినాళ్ళలో నీల జీవితానికి నిశ్చితమైన నిర్దిష్ట గమ్యాల్లేవు. ఆమె జీవితం ఆమె చేతుల్లో లేదు. ఆమెకి తెలియకుండానే జారిపోయినదాన్ని వొడిసి పట్టుకుని తనకు నచ్చిన రీతిలో దిద్దుకొనే క్రమంలోనే తనను తాను తెలుసుకోగలిగింది. చదువుకొంది. సొంత కాళ్ల మీద నిలబడింది. తనని బాధించే హక్కు ఎవరికీ లేదు. అదే సమయంలో తాను ఎవరి బాధకీ కారణం కాకూడదు అన్నదే ఆమె తన జీవితతత్త్వంగా మార్చుకొంది. ఒక విధంగా నీల స్వీయ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్చ కోసం చేసిన పెనుగులాటే ఆమె గమనం. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. 'ఆడా మగా సంబంధాల్లో సార్వకాలికమైన సార్వజనీనమైన విలువలేమీ ఉండవని,' తెలుసుకుంది. భయాల సంకెళ్లు తెంచుకుంది. - ఎ కె ప్రభాకర్© 2017,www.logili.com All Rights Reserved.