భాషా బోధనలో పద పరిచయానికి నిర్దిష్టమైన పద్ధతులుంటాయి. ఈ పద్ధతుల్ని వాడి పరీక్షించి నిగ్గుతీరిన అనుభవజ్ఞురాలైన ఉపాద్యాయురాలిగా మల్లీశ్వరి ‘నుడి గుడి’ నిర్మాణంలో అవే మార్గాలని అవలంబించారు. అయితే పద పరిచయానికి, వివరణకి ఆమె ఎన్నుకున్న విధానం సాహిత్యంతో ముడిపడి ఉంది. అందువల్ల అది పిల్లలకి, పెద్దలకి హ్యాండ్ బుక్కా తయారైంది. ఏకకాలంలో సాహిత్యాభిమానులకి, భాషాధ్యయన పరులకి ఆసక్తికరంగా రూపొందింది. ఒక పదాన్ని దానికున్న అర్థాలతో పరిచయం చేయటానికి గ్రంథ రచయిత చాలా సందర్భాల్లో సాహిత్యంలో భాషా సమాజంలో దాని ప్రయోగంతో పాటు అర్థ ప్రయోగాన్ని సైతం ప్రధానంగా ఉటంకించటం గమనిస్తాం. అర్థ బోధ నుంచి పదవగతి పద్దతిగా దీన్ని గ్రహించాలి. ఈ పధ్ధతినొక బలమైన పూనికతో చేసిన కారణంగా ‘నుడి గుడి’ విస్మృతి పెరిగినప్పటికీ చదువరులకు ఆసక్తి దాయకంగా పరిణమించింది.
భాషా బోధనలో పద పరిచయానికి నిర్దిష్టమైన పద్ధతులుంటాయి. ఈ పద్ధతుల్ని వాడి పరీక్షించి నిగ్గుతీరిన అనుభవజ్ఞురాలైన ఉపాద్యాయురాలిగా మల్లీశ్వరి ‘నుడి గుడి’ నిర్మాణంలో అవే మార్గాలని అవలంబించారు. అయితే పద పరిచయానికి, వివరణకి ఆమె ఎన్నుకున్న విధానం సాహిత్యంతో ముడిపడి ఉంది. అందువల్ల అది పిల్లలకి, పెద్దలకి హ్యాండ్ బుక్కా తయారైంది. ఏకకాలంలో సాహిత్యాభిమానులకి, భాషాధ్యయన పరులకి ఆసక్తికరంగా రూపొందింది. ఒక పదాన్ని దానికున్న అర్థాలతో పరిచయం చేయటానికి గ్రంథ రచయిత చాలా సందర్భాల్లో సాహిత్యంలో భాషా సమాజంలో దాని ప్రయోగంతో పాటు అర్థ ప్రయోగాన్ని సైతం ప్రధానంగా ఉటంకించటం గమనిస్తాం. అర్థ బోధ నుంచి పదవగతి పద్దతిగా దీన్ని గ్రహించాలి. ఈ పధ్ధతినొక బలమైన పూనికతో చేసిన కారణంగా ‘నుడి గుడి’ విస్మృతి పెరిగినప్పటికీ చదువరులకు ఆసక్తి దాయకంగా పరిణమించింది.© 2017,www.logili.com All Rights Reserved.