1878 నుంచి 1977 దాకా గడిచిన నూరేళ్లలో తెలుగు సమాజం ఏఏ మలుపులు తిరిగింది? ఏఏ ఎగుడుదిగుడులకి లోనైంది? వర్గవైరుధ్యాలు ఏ స్థాయిలో వ్యక్తం అయ్యాయి? ప్రజా చైతన్యం ఎలా వెల్లువెత్తింది? ఈ నూరేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రంటే నూరేళ్ళ తెలుగుభాషా చరిత్ర మాత్రమే కాదు... నూరేళ్ళ తెలుగునాట నడిచిన రాజకీయార్థిక సామాజిక చారిత్రక విశ్లేషణ కూడా. అందుకు ఈ నవలల పరిచయం ఒక చిరుదివ్వెగా ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. ఈ ప్రచురణ ప్రయత్నంలో రచయితల జనన మరణ తేదీలు సేకరించటంలో చాలా ప్రయాసపడ్డాం. కొంతమంది తేదీలు ఒక్కోచోట, ఒక్కోరకంగా ఉన్నాయి. నూరేళ్ళ చరిత్రనే పట్టుకోలేకపోవటం మన వెనకబాటుతనాన్ని, చారిత్రిక దృష్టిలోపాన్ని ఎత్తి చూపుతోంది.
1878 నుంచి 1977 దాకా గడిచిన నూరేళ్లలో తెలుగు సమాజం ఏఏ మలుపులు తిరిగింది? ఏఏ ఎగుడుదిగుడులకి లోనైంది? వర్గవైరుధ్యాలు ఏ స్థాయిలో వ్యక్తం అయ్యాయి? ప్రజా చైతన్యం ఎలా వెల్లువెత్తింది? ఈ నూరేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రంటే నూరేళ్ళ తెలుగుభాషా చరిత్ర మాత్రమే కాదు... నూరేళ్ళ తెలుగునాట నడిచిన రాజకీయార్థిక సామాజిక చారిత్రక విశ్లేషణ కూడా. అందుకు ఈ నవలల పరిచయం ఒక చిరుదివ్వెగా ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. ఈ ప్రచురణ ప్రయత్నంలో రచయితల జనన మరణ తేదీలు సేకరించటంలో చాలా ప్రయాసపడ్డాం. కొంతమంది తేదీలు ఒక్కోచోట, ఒక్కోరకంగా ఉన్నాయి. నూరేళ్ళ చరిత్రనే పట్టుకోలేకపోవటం మన వెనకబాటుతనాన్ని, చారిత్రిక దృష్టిలోపాన్ని ఎత్తి చూపుతోంది.© 2017,www.logili.com All Rights Reserved.