తెలంగాణ ప్రాంతం ఎన్నో రకాలుగా విశిష్టమైంది. ఈ నేలకు ఇక్కడి మనుషులకు ఉన్న చరిత్ర మరే ప్రాంతానికి లేదు. కొన్ని శతాబ్దాల పాటు నవాబుల పాలనలో జీవించిన ప్రాంతం ఇది. తెలంగాణ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మందిని పోగొట్టుకున్నాం. ఆ తరువాత నక్సలైటు ఉద్యమంలో, ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాలు చేస్తూ నిరంతరం పోరాటాన్ని సాగిస్తున్న ప్రాంతం ఈ దేశంలో ఏదీ అంటే అది తెలంగాణనే.కాశ్మీర్ లో ఒక సవత్సరం పోరాటం జరిగితే మళ్లి నాలుగేళ్ళదాకా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తరువాత అక్కడ మళ్లి పోరాటం ప్రారంభం అవుతుంది. 1989 తరువాతనే కాశ్మీర్ లోయలో రకరకాల కారణాలవల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తెలంగాణ పోరాటానికి కాశ్మీర్ లో జరిగే పోరాటానికి తేడా ఉంది. ఇంత సుదీర్ఘ పోరాట చరిత్ర అక్కడ కూడా లేదు. అయితే అక్కడి జీవితాల్లో కూడా సంక్షోభం ఉంది. అనిశ్చితి ఉంది. తుపాకీ నీడలో పుట్టి తుపాకీ నీడలోనే 20 ఏళ్లుగా జీవిస్తున్న యువకులు అక్కడ ఉన్నారు. అందువల్ల అక్కడ కూడా కధలున్నాయి. వెతల వెనుక కదలుంటయి. ఎక్కడ కష్టాలు ఉంటే, ఎక్కడ పోరాటం ఉంటే, ఎక్కడ సంఘర్షణ ఉంటే, ఎక్కడ ప్రతిఘటన ఉంటే అక్కడ తప్పకుండా కధలుంటయి. కాబట్టి తెలంగాణలో నవలా ప్రక్రియ ముందు వచ్చిందా. ఆలస్యంగా వచ్చిందా అన్నది విశ్లేషకులు చెప్పవచ్చుగాని తెలంగాణలో కధ ఎప్పుడొచ్చినా, పాట ఎప్పుడొచ్చినా, నవల ఎప్పుడొచ్చినా అది ఇతర ప్రాంతాల పాటకంటే, కధ కంటే, నవల కంటే బలంగా ఉంటుంది, పదునుగా ఉంటుంది. ఆ కధలో, పాటలో లేక నవలలో జీవితం ఉంటుంది.
డా" పంతంగి వెంకటేశ్వర్లు
తెలంగాణ ప్రాంతం ఎన్నో రకాలుగా విశిష్టమైంది. ఈ నేలకు ఇక్కడి మనుషులకు ఉన్న చరిత్ర మరే ప్రాంతానికి లేదు. కొన్ని శతాబ్దాల పాటు నవాబుల పాలనలో జీవించిన ప్రాంతం ఇది. తెలంగాణ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మందిని పోగొట్టుకున్నాం. ఆ తరువాత నక్సలైటు ఉద్యమంలో, ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాలు చేస్తూ నిరంతరం పోరాటాన్ని సాగిస్తున్న ప్రాంతం ఈ దేశంలో ఏదీ అంటే అది తెలంగాణనే.కాశ్మీర్ లో ఒక సవత్సరం పోరాటం జరిగితే మళ్లి నాలుగేళ్ళదాకా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తరువాత అక్కడ మళ్లి పోరాటం ప్రారంభం అవుతుంది. 1989 తరువాతనే కాశ్మీర్ లోయలో రకరకాల కారణాలవల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తెలంగాణ పోరాటానికి కాశ్మీర్ లో జరిగే పోరాటానికి తేడా ఉంది. ఇంత సుదీర్ఘ పోరాట చరిత్ర అక్కడ కూడా లేదు. అయితే అక్కడి జీవితాల్లో కూడా సంక్షోభం ఉంది. అనిశ్చితి ఉంది. తుపాకీ నీడలో పుట్టి తుపాకీ నీడలోనే 20 ఏళ్లుగా జీవిస్తున్న యువకులు అక్కడ ఉన్నారు. అందువల్ల అక్కడ కూడా కధలున్నాయి. వెతల వెనుక కదలుంటయి. ఎక్కడ కష్టాలు ఉంటే, ఎక్కడ పోరాటం ఉంటే, ఎక్కడ సంఘర్షణ ఉంటే, ఎక్కడ ప్రతిఘటన ఉంటే అక్కడ తప్పకుండా కధలుంటయి. కాబట్టి తెలంగాణలో నవలా ప్రక్రియ ముందు వచ్చిందా. ఆలస్యంగా వచ్చిందా అన్నది విశ్లేషకులు చెప్పవచ్చుగాని తెలంగాణలో కధ ఎప్పుడొచ్చినా, పాట ఎప్పుడొచ్చినా, నవల ఎప్పుడొచ్చినా అది ఇతర ప్రాంతాల పాటకంటే, కధ కంటే, నవల కంటే బలంగా ఉంటుంది, పదునుగా ఉంటుంది. ఆ కధలో, పాటలో లేక నవలలో జీవితం ఉంటుంది. డా" పంతంగి వెంకటేశ్వర్లు© 2017,www.logili.com All Rights Reserved.