ప్రియతమా ఓ ప్రియతమా అనే ఈ చిన్న నవలని బలభద్రపాత్రుని రమణి గారు అతి చిన్న వయసులో వ్రాయడం ఒక విశేషం అయితే,
ఓ కన్నెని విధవరాలిగా మార్చడంతో మొదలైన సనాతన కథ మరో మూడు నాలుగు పేజీలలోనే ఆల్ట్రా మోడరన్ అమెరికన్ బేస్డ్ కథగా మారి, అక్కడి నుంచి మళ్ళీ ఇండియా చేరి, ఊహాతీతమైన మలుపులతో ముగియడం నిజంగా పాఠకుల్ని అబ్బురపరుస్తుంది. నాకు అర్థమైంది ఒక్కటే, రమణి గారు నిన్నటి హిస్టరీ రచయిత్రి కాదు. రేపటి సూర్యుణ్ణి ఇవ్వాలే పట్టుకుని కాలానికంటే ముందు పరిగెడుతూ, రేపు రాబోయే మార్పుల్ని ఈనాడే పాఠకులకి అందించే విదూషీమణి.
ఆమె శైలి అనితరసాధ్యం. మొదలుపెట్టడం వరకే మనపని. ఆ తరువాత ఆగడమూ, ఆపడమూ మన చేతిల్లో ఉండదు. అటు సాంప్రదాయాల మీద ఎంత పట్టు ఉందో, ఇటు నవ నాగరికత మీదా అంతే పట్టు చూపిస్తూ ప్రాక్ పశ్చిమ ఆలోచనారీతుల్ని ఒడిసిపట్టడం.. అది మనకి ద్రాక్షపాకంలా అందించడం, రమణిగారికి పుట్టుకతో వచ్చిన విద్య. ఏ ఒక్క పాత్రా వృథాయైనది కాదు. ప్రతి పాత్రకీ ఓ నిర్దిష్టమైన ప్రయోజనం ఉన్నది. కథాగమనానికి ప్రతి పాత్రా సహకరించేదే. ముఖ్యంగా అరుంధతి పాత్రని మలిచిన విధానం చాలా గొప్పగా ఉంది.
- భువనచంద్ర
ప్రియతమా ఓ ప్రియతమా అనే ఈ చిన్న నవలని బలభద్రపాత్రుని రమణి గారు అతి చిన్న వయసులో వ్రాయడం ఒక విశేషం అయితే, ఓ కన్నెని విధవరాలిగా మార్చడంతో మొదలైన సనాతన కథ మరో మూడు నాలుగు పేజీలలోనే ఆల్ట్రా మోడరన్ అమెరికన్ బేస్డ్ కథగా మారి, అక్కడి నుంచి మళ్ళీ ఇండియా చేరి, ఊహాతీతమైన మలుపులతో ముగియడం నిజంగా పాఠకుల్ని అబ్బురపరుస్తుంది. నాకు అర్థమైంది ఒక్కటే, రమణి గారు నిన్నటి హిస్టరీ రచయిత్రి కాదు. రేపటి సూర్యుణ్ణి ఇవ్వాలే పట్టుకుని కాలానికంటే ముందు పరిగెడుతూ, రేపు రాబోయే మార్పుల్ని ఈనాడే పాఠకులకి అందించే విదూషీమణి. ఆమె శైలి అనితరసాధ్యం. మొదలుపెట్టడం వరకే మనపని. ఆ తరువాత ఆగడమూ, ఆపడమూ మన చేతిల్లో ఉండదు. అటు సాంప్రదాయాల మీద ఎంత పట్టు ఉందో, ఇటు నవ నాగరికత మీదా అంతే పట్టు చూపిస్తూ ప్రాక్ పశ్చిమ ఆలోచనారీతుల్ని ఒడిసిపట్టడం.. అది మనకి ద్రాక్షపాకంలా అందించడం, రమణిగారికి పుట్టుకతో వచ్చిన విద్య. ఏ ఒక్క పాత్రా వృథాయైనది కాదు. ప్రతి పాత్రకీ ఓ నిర్దిష్టమైన ప్రయోజనం ఉన్నది. కథాగమనానికి ప్రతి పాత్రా సహకరించేదే. ముఖ్యంగా అరుంధతి పాత్రని మలిచిన విధానం చాలా గొప్పగా ఉంది. - భువనచంద్ర© 2017,www.logili.com All Rights Reserved.