కొండ కింద నుంచి చుస్తే, ఇళ్లు పువ్వుల్లా కనిపిస్తాయి. ఊరు ఒక పుష్పగుచ్ఛంలా కనిపిస్తుంది. పుష్పగుచ్చంలో ఆకుల్లా, రెమ్మల్లా, ఇళ్ల చుట్టూ మర్రిమాన్లు, సుంకేసుల, దేవగన్నేరు చెట్లు రేగు బలుసు పొదలు.
- హెచ్చార్కె
అనగనగా ఒక ఊరు.
చాల చిన్న ఊరు.
రెండొందల ఇళ్లు ఉండీ లేక.
ఆ ఊరు ఒక కొండ మీద ఉంటుంది.
అసలు ఆ ఊరి పేరే కొండమీది బొల్లవరం.