రెబెల్ అంటే తిరుగుబాటు చేసేవాడు అని అర్థం. కానీ, రెబెల్ అనగానే పొగరుబోతు, విప్లవకారుడు అనే దురభిప్రాయం సమాజంలో పాతుకుపోయింది. దీనికి ముఖ్య కారణం విప్లవానికీ, తిరుగుబాటుకు అర్థం సరిగా తెలియకపోవడమే. బలవంతంగా లేదా హింసించడం ద్వారా, దేనికోసమో కాకుండా, దేనినో వ్యతిరేకిస్తూ చేసే వ్యవస్థీకృత పోరాటమే విప్లవం. అది కోపం నుంచి పుడుతుంది. అందుకే అది ఎప్పుడూ హింసాత్మకంగా ఉంటుంది. ప్రేమ, కరుణ, అవగాహన, నిశ్శబ్దాల నుంచే తిరుగుబాటు పుడుతుంది. అందుకే అది చాలా శాంతియుతంగా, అహింసాయుతంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. అది దేనినీ వ్యతిరేకించదు. అందుకే దానికి ఎలాంటి సంహర్షణలు, పోరాటాలతో పని ఉండదు.
రెబెల్ విప్లవకారుడు కాడు. అతడు అమానవీయమైన, అశాస్త్రీయమైన, మూర్ఖమైన తప్పులన్నింటినీ ఎదిరిస్తూ తిరుగుబాటు చేసే యోధుడు, దేనికీ తల వంచని వీరుడు. అతడు చాలా సృజనాత్మకంగా ఉంటాడు. అందుకే అనేక అవినీతులను నీతులుగా, తప్పులను ఒప్పులుగా, అజ్ఞానాలను జ్ఞానంగా సమాజం మనకు బోధించి తప్పు చేసిందనే వాస్తవాన్ని సమాజమే తెలుసుకునేలా తిరుగుబాటు చేస్తాడు. అంటే, సత్యం కోసం, స్వేచ్చ కోసం, ప్రేమ కోసం, నవీన మానవులతో కూడిన నూతన మానవాళి కోసం, నూతన చైతన్యంతో కూడిన నూతన సమాజం కోసం రెబెల్ తిరుగుబాటు చేస్తాడు.
అక్షరం సత్యమైతే, మాట వేదమవుతుంది. మనిషికి జ్ఞానోదయమైతేనే, అక్షరం సత్యమవుతుంది. ఇలా ప్రతి అక్షరంలో సత్యాన్ని నింపి ప్రతి మాటను వేదం చేసిన మహనీయుడు ఓషో ఆ వేదంలోని ఒక జ్ఞాన తుషారమే ఈ పుస్తకం.
రెబెల్ అంటే తిరుగుబాటు చేసేవాడు అని అర్థం. కానీ, రెబెల్ అనగానే పొగరుబోతు, విప్లవకారుడు అనే దురభిప్రాయం సమాజంలో పాతుకుపోయింది. దీనికి ముఖ్య కారణం విప్లవానికీ, తిరుగుబాటుకు అర్థం సరిగా తెలియకపోవడమే. బలవంతంగా లేదా హింసించడం ద్వారా, దేనికోసమో కాకుండా, దేనినో వ్యతిరేకిస్తూ చేసే వ్యవస్థీకృత పోరాటమే విప్లవం. అది కోపం నుంచి పుడుతుంది. అందుకే అది ఎప్పుడూ హింసాత్మకంగా ఉంటుంది. ప్రేమ, కరుణ, అవగాహన, నిశ్శబ్దాల నుంచే తిరుగుబాటు పుడుతుంది. అందుకే అది చాలా శాంతియుతంగా, అహింసాయుతంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. అది దేనినీ వ్యతిరేకించదు. అందుకే దానికి ఎలాంటి సంహర్షణలు, పోరాటాలతో పని ఉండదు. రెబెల్ విప్లవకారుడు కాడు. అతడు అమానవీయమైన, అశాస్త్రీయమైన, మూర్ఖమైన తప్పులన్నింటినీ ఎదిరిస్తూ తిరుగుబాటు చేసే యోధుడు, దేనికీ తల వంచని వీరుడు. అతడు చాలా సృజనాత్మకంగా ఉంటాడు. అందుకే అనేక అవినీతులను నీతులుగా, తప్పులను ఒప్పులుగా, అజ్ఞానాలను జ్ఞానంగా సమాజం మనకు బోధించి తప్పు చేసిందనే వాస్తవాన్ని సమాజమే తెలుసుకునేలా తిరుగుబాటు చేస్తాడు. అంటే, సత్యం కోసం, స్వేచ్చ కోసం, ప్రేమ కోసం, నవీన మానవులతో కూడిన నూతన మానవాళి కోసం, నూతన చైతన్యంతో కూడిన నూతన సమాజం కోసం రెబెల్ తిరుగుబాటు చేస్తాడు. అక్షరం సత్యమైతే, మాట వేదమవుతుంది. మనిషికి జ్ఞానోదయమైతేనే, అక్షరం సత్యమవుతుంది. ఇలా ప్రతి అక్షరంలో సత్యాన్ని నింపి ప్రతి మాటను వేదం చేసిన మహనీయుడు ఓషో ఆ వేదంలోని ఒక జ్ఞాన తుషారమే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.