పుస్తకాల సంచీని భుజానికి తగిలించుకొని, ముఖం మీదికి పడుతున్న పొడవాటి జుట్టును వెనక్కి నెట్టుకుంటూ వడపళని సిటీ బస్ స్టేషన్ లో నిలబడ్డాడు చిన్నముత్తు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయం అది. మెల్లిమెల్లిగా జనంతో నిండిపోతున్నది బస్ స్టేషన్. ఆ జనాన్ని అటూ ఇటూ చేరవేసేందుకు వేగం పుంజుకుంటున్నది బస్సుల రద్దీ కూడా. 'ఎక్కడికి పోవాలి తంబీ? నువ్వు ఏ బస్ ఎక్కాలి?' ఉన్నట్లుండి ఒక కంఠం ప్రశ్నించటంతో ఉలిక్కిపడి వెనక్కి చూశాడు చిన్నముత్తు. మూడు అడుగుల పొడవుండే లాటీకర్రను పట్టుకొని దగ్గరలోనే నిలబడి ఉన్నాడు బస్ స్టేషన్ లో పనిచేసే సెక్యూరిటీ గార్డు ఒకతను. గుబురుగా పెంచిన మీసాలను మెలిపెడుతూ, అతనివంకే చూస్తున్నాడు మీసాలకంటే దట్టంగా ఉన్న కనుబొమ్మలలో నుంచి. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
పుస్తకాల సంచీని భుజానికి తగిలించుకొని, ముఖం మీదికి పడుతున్న పొడవాటి జుట్టును వెనక్కి నెట్టుకుంటూ వడపళని సిటీ బస్ స్టేషన్ లో నిలబడ్డాడు చిన్నముత్తు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయం అది. మెల్లిమెల్లిగా జనంతో నిండిపోతున్నది బస్ స్టేషన్. ఆ జనాన్ని అటూ ఇటూ చేరవేసేందుకు వేగం పుంజుకుంటున్నది బస్సుల రద్దీ కూడా. 'ఎక్కడికి పోవాలి తంబీ? నువ్వు ఏ బస్ ఎక్కాలి?' ఉన్నట్లుండి ఒక కంఠం ప్రశ్నించటంతో ఉలిక్కిపడి వెనక్కి చూశాడు చిన్నముత్తు. మూడు అడుగుల పొడవుండే లాటీకర్రను పట్టుకొని దగ్గరలోనే నిలబడి ఉన్నాడు బస్ స్టేషన్ లో పనిచేసే సెక్యూరిటీ గార్డు ఒకతను. గుబురుగా పెంచిన మీసాలను మెలిపెడుతూ, అతనివంకే చూస్తున్నాడు మీసాలకంటే దట్టంగా ఉన్న కనుబొమ్మలలో నుంచి. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.