రోషనార తెలుగు పాఠకులకు చిరపరిచితమైన వ్యక్తి. ముఖ్యంగా ప్రసాద్ రచన 'రోషనార' అత్యంత ప్రజాదరణ పొందింది. 'రోషనార' కు ఓ ఇమేజ్ ని పాఠకుల మనసులో ప్రతిష్టించిన నవల అది. రచన ఆసక్తికరంగా ఉంటుంది. కానీ అది చారిత్రిక నవలా రచన అనేకన్నా కాల్పనిక నవల అనడమే సబబు. చారిత్రిక ఆధారాల వల్ల ఏర్పడే రోషనార వ్యక్తిత్వ రూపం ప్రతిష్టితమైన రోషనార రూపానికి భిన్నం. అయితే ఇప్పటికే పాఠకుల మనసులలో ముద్రితమై ఉన్న రోషనార చిత్రానికి భిన్నమైన చిత్రం గీసి పాఠకులను మెప్పించటం సాహసమైన పని. అయినాసరే, రోషనార నవల రాసేందుకు సిద్ధమయ్యాను. ఇందుకు ప్రధాన కారణం చరిత్ర పుస్తకాలలోనూ, నవలల్లోనూ రోషనార పాత్ర వ్యక్తిత్వాన్ని, ఆమె ప్రవర్తననూ సరైన రీతిలో విశ్లేషించాక ఆమెను ఓ విలన్ లా దుష్ట పాత్రలా చిత్రీకరించటమే.
చిత్రరచనలలో ప్రేమగాథలకు ఉన్న ప్రాధాన్యం ఇతర గాధలకు విస్తృత ప్రచారం పొందాయి. అందుకే జహానార, రజియా సుల్తాన్, అనార్కలి వంటి గాథలు విస్తృత ప్రచారం పొందాయి. కానీ అనేక నిబంధనలు, నియమాల అడుగున నలిగి ప్రేమ రాహిత్యభావనతో సతమతమై ప్రేమకోసం తపించిన రోషనార దుష్ట పాత్ర అయింది. అసలు గాథ ప్రచారానికి రాలేదు. అందుకే రోషనార రచనలో కేవలం రోషనార పాత్రనేకాక షాజహాన్, జహనార, ఔరంగజేబు వంటి పాత్రల వ్యక్తిత్వ విశ్లేషణనూ నవల నిడివి పరిమిత పరిధిల ప్రాధాన్యాన్నిస్తూ నవల రచన సాగించాను.
రోషనార తెలుగు పాఠకులకు చిరపరిచితమైన వ్యక్తి. ముఖ్యంగా ప్రసాద్ రచన 'రోషనార' అత్యంత ప్రజాదరణ పొందింది. 'రోషనార' కు ఓ ఇమేజ్ ని పాఠకుల మనసులో ప్రతిష్టించిన నవల అది. రచన ఆసక్తికరంగా ఉంటుంది. కానీ అది చారిత్రిక నవలా రచన అనేకన్నా కాల్పనిక నవల అనడమే సబబు. చారిత్రిక ఆధారాల వల్ల ఏర్పడే రోషనార వ్యక్తిత్వ రూపం ప్రతిష్టితమైన రోషనార రూపానికి భిన్నం. అయితే ఇప్పటికే పాఠకుల మనసులలో ముద్రితమై ఉన్న రోషనార చిత్రానికి భిన్నమైన చిత్రం గీసి పాఠకులను మెప్పించటం సాహసమైన పని. అయినాసరే, రోషనార నవల రాసేందుకు సిద్ధమయ్యాను. ఇందుకు ప్రధాన కారణం చరిత్ర పుస్తకాలలోనూ, నవలల్లోనూ రోషనార పాత్ర వ్యక్తిత్వాన్ని, ఆమె ప్రవర్తననూ సరైన రీతిలో విశ్లేషించాక ఆమెను ఓ విలన్ లా దుష్ట పాత్రలా చిత్రీకరించటమే. చిత్రరచనలలో ప్రేమగాథలకు ఉన్న ప్రాధాన్యం ఇతర గాధలకు విస్తృత ప్రచారం పొందాయి. అందుకే జహానార, రజియా సుల్తాన్, అనార్కలి వంటి గాథలు విస్తృత ప్రచారం పొందాయి. కానీ అనేక నిబంధనలు, నియమాల అడుగున నలిగి ప్రేమ రాహిత్యభావనతో సతమతమై ప్రేమకోసం తపించిన రోషనార దుష్ట పాత్ర అయింది. అసలు గాథ ప్రచారానికి రాలేదు. అందుకే రోషనార రచనలో కేవలం రోషనార పాత్రనేకాక షాజహాన్, జహనార, ఔరంగజేబు వంటి పాత్రల వ్యక్తిత్వ విశ్లేషణనూ నవల నిడివి పరిమిత పరిధిల ప్రాధాన్యాన్నిస్తూ నవల రచన సాగించాను.© 2017,www.logili.com All Rights Reserved.