క్రాష్అవుతున్న విమానపు హోరు వినిపించింది ముందు. అది విమానం కాదు ఇంచుమించు అంతే వేగంగాదూసుకొస్తున్న కారుగాబోదపడటానికి పట్టింది అరలిప్త మాత్రమే. చెవులు చిల్లులుపడే హారన్ వింటూ రోడ్డుమీది జనం పరుగెత్తడం ప్రారంభించారు.
నిశీధిబురఖాని తొలగించుకున్న భాగ్యనగరం వేయి కిరణాల వైఢూర్యంలా విద్యుద్దీపాల మధ్య వెలిగిపోతున్న రాత్రిఎనిమిది గంటలవేళ. రద్దీగా వున్న అబిడ్స్ సెంటర్లో జనం కకావికలవుతున్నారు. కమోషన్.... కేకలు... ఆర్తనాదాలు ....
ఈహఠాత్ పరిణామానికి బీట్ కానిస్టేబుల్స్ ముందు తొట్రుపడ్డారు. మరుక్షణం మిస్సైల్లా ఉరికివస్తున్నఅంబాసిడర్డిజిపి ప్రభుత్వవాహనంగా గుర్తించి అలర్టయి సెల్యూట్ చేశారు.
ఎంతటి సాధారణ స్థితిలోనైనా పోలీస్ డైరెక్టర్ జనరల్ వాహనం ఇంత వేగంగాప్రయాణంచేయడమన్నదివారిఅనుభవంలోసైతం ఎన్నడూచూడనిది.
తెల్లమొహం వేసుకుని అంతా చూస్తుండగానే అంబాసిడర్ నాంపల్లి వేపు తిరగబోతూ ఎదురుగా వున్నఫుట్పాత్నితాకబోయి వెంటనేకీచుమన్న శబ్దంతో స్కిడ్ అయి మళ్ళీ రోడ్డు మధ్యగా వచ్చింది. దాన్ని అనుసరిస్తూ మరో పోలీస్ జీప్.
సాయుధులై వున్న పోలీసు బలగం ఎక్కడో జరుగుతున్న మారణకాండని నియంత్రించాలని వెళుతున్నట్టుగావున్నారు.
జీప్వేగం పెరిగింది. అయినాఅంబాసిడర్ కీ దానికీ మధ్య వందగజాల దూరం వుంది. ఆ దూరం క్రమంగా పెరుగుతోంది.రస్తాలో నిలబడ్డట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం జరుగుతున్నదీ గుర్తించేలోగానే సిన అంబాసిడర్ క్షణంలో మాయమై అతడికి గుండెదడ పుట్టించింది.
ట్రాఫిక్ చెల్లాచెదరయింది. డిజిపి అంబాసిడర్ని అంతసేపూ అనుసరించిన జీప్ కార్లమధ్య చిక్కుకుపోయింది. జీపులోనిఎసిపివైలో మెస్సేజ్ అందించారు కంట్రోల్ రూంకి,
"గోయింగ్ టువార్డ్స్ పబ్లిక్ గార్డెన్... కాలింగ్ ఎసిపి... ట్రాఫిక్ డిజిపి వెహికల్ గోయింగ్ టువార్డ్స్"
కంట్రోల్ రూంలో రిసీవ్ చేసుకోబడిన మెసేజ్ వెంటనే కమ్యూనికేట్ చేయబడింది అన్ని కార్నర్స్ కి.
“కాలింగ్ ట్రాఫిక్ వింగ్... కంట్రోల్ రూం.... కాలింగ్ ఆల్ సెంటర్స్.... స్టాప్ డిజిపి వెహికల్ గోయింగ్ టువార్డ్స్”
టాంక్ బండ్ దగ్గర సిగరెట్ కాల్చుతూ నిలబడ్డ ఓ ట్రాఫిక్ ఎస్ఏ అలర్టయ్యాడు. “పార్టన్ మి సర్. డిజిపి వెహికల్నఆపేయాలా?వై” మెస్సేజ్లో ఏదో పొరపాటు దొర్లినట్టు నొచ్చుకున్నాడు.
“యస్. డిజిపి వెహికల్ ని పట్టుకోండి” ఓ గావుకేకలా వినిపించింది. "వైషుడ్ వియ్ సర్” అతడి ప్రశ్న ఇంకాపూర్తికాలేదు.“డామిటి! డిజిపివెహికల్ నిదొంగతనంగా తరలించుకుపోతున్నాడో క్రిమినల్. హోల్ హిమ్” |
అప్పటికిఅసలువిషయం అర్థమైన సుమారు పన్నెండు పోలీస్ వేన్స్ఒకేసారిఅన్నికార్నర్సునుంచిపబ్లిక్గార్డెన్కేసిదూసుకుపోతున్నాయి. రాష్ట్రపోలీస్ చరిత్రలోనే ఇది తొలిసారి.
ఓక్రిమినల్ స్టేట్ పోలీస్ విభాగపు అత్యున్నతాధికారి కారు అపహరించుకుపోవడాన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు.పోలీస్ వాన్స్ సైరన్లతో ఇప్పుడు జంట నగరాల రోడ్లు హోరెత్తిపోతున్నాయి.
క్రాష్అవుతున్న విమానపు హోరు వినిపించింది ముందు. అది విమానం కాదు ఇంచుమించు అంతే వేగంగాదూసుకొస్తున్న కారుగాబోదపడటానికి పట్టింది అరలిప్త మాత్రమే. చెవులు చిల్లులుపడే హారన్ వింటూ రోడ్డుమీది జనం పరుగెత్తడం ప్రారంభించారు. నిశీధిబురఖాని తొలగించుకున్న భాగ్యనగరం వేయి కిరణాల వైఢూర్యంలా విద్యుద్దీపాల మధ్య వెలిగిపోతున్న రాత్రిఎనిమిది గంటలవేళ. రద్దీగా వున్న అబిడ్స్ సెంటర్లో జనం కకావికలవుతున్నారు. కమోషన్.... కేకలు... ఆర్తనాదాలు .... ఈహఠాత్ పరిణామానికి బీట్ కానిస్టేబుల్స్ ముందు తొట్రుపడ్డారు. మరుక్షణం మిస్సైల్లా ఉరికివస్తున్నఅంబాసిడర్డిజిపి ప్రభుత్వవాహనంగా గుర్తించి అలర్టయి సెల్యూట్ చేశారు. ఎంతటి సాధారణ స్థితిలోనైనా పోలీస్ డైరెక్టర్ జనరల్ వాహనం ఇంత వేగంగాప్రయాణంచేయడమన్నదివారిఅనుభవంలోసైతం ఎన్నడూచూడనిది. తెల్లమొహం వేసుకుని అంతా చూస్తుండగానే అంబాసిడర్ నాంపల్లి వేపు తిరగబోతూ ఎదురుగా వున్నఫుట్పాత్నితాకబోయి వెంటనేకీచుమన్న శబ్దంతో స్కిడ్ అయి మళ్ళీ రోడ్డు మధ్యగా వచ్చింది. దాన్ని అనుసరిస్తూ మరో పోలీస్ జీప్. సాయుధులై వున్న పోలీసు బలగం ఎక్కడో జరుగుతున్న మారణకాండని నియంత్రించాలని వెళుతున్నట్టుగావున్నారు. జీప్వేగం పెరిగింది. అయినాఅంబాసిడర్ కీ దానికీ మధ్య వందగజాల దూరం వుంది. ఆ దూరం క్రమంగా పెరుగుతోంది.రస్తాలో నిలబడ్డట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం జరుగుతున్నదీ గుర్తించేలోగానే సిన అంబాసిడర్ క్షణంలో మాయమై అతడికి గుండెదడ పుట్టించింది. ట్రాఫిక్ చెల్లాచెదరయింది. డిజిపి అంబాసిడర్ని అంతసేపూ అనుసరించిన జీప్ కార్లమధ్య చిక్కుకుపోయింది. జీపులోనిఎసిపివైలో మెస్సేజ్ అందించారు కంట్రోల్ రూంకి, "గోయింగ్ టువార్డ్స్ పబ్లిక్ గార్డెన్... కాలింగ్ ఎసిపి... ట్రాఫిక్ డిజిపి వెహికల్ గోయింగ్ టువార్డ్స్" కంట్రోల్ రూంలో రిసీవ్ చేసుకోబడిన మెసేజ్ వెంటనే కమ్యూనికేట్ చేయబడింది అన్ని కార్నర్స్ కి. “కాలింగ్ ట్రాఫిక్ వింగ్... కంట్రోల్ రూం.... కాలింగ్ ఆల్ సెంటర్స్.... స్టాప్ డిజిపి వెహికల్ గోయింగ్ టువార్డ్స్” టాంక్ బండ్ దగ్గర సిగరెట్ కాల్చుతూ నిలబడ్డ ఓ ట్రాఫిక్ ఎస్ఏ అలర్టయ్యాడు. “పార్టన్ మి సర్. డిజిపి వెహికల్నఆపేయాలా?వై” మెస్సేజ్లో ఏదో పొరపాటు దొర్లినట్టు నొచ్చుకున్నాడు. “యస్. డిజిపి వెహికల్ ని పట్టుకోండి” ఓ గావుకేకలా వినిపించింది. "వైషుడ్ వియ్ సర్” అతడి ప్రశ్న ఇంకాపూర్తికాలేదు.“డామిటి! డిజిపివెహికల్ నిదొంగతనంగా తరలించుకుపోతున్నాడో క్రిమినల్. హోల్ హిమ్” | అప్పటికిఅసలువిషయం అర్థమైన సుమారు పన్నెండు పోలీస్ వేన్స్ఒకేసారిఅన్నికార్నర్సునుంచిపబ్లిక్గార్డెన్కేసిదూసుకుపోతున్నాయి. రాష్ట్రపోలీస్ చరిత్రలోనే ఇది తొలిసారి. ఓక్రిమినల్ స్టేట్ పోలీస్ విభాగపు అత్యున్నతాధికారి కారు అపహరించుకుపోవడాన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు.పోలీస్ వాన్స్ సైరన్లతో ఇప్పుడు జంట నగరాల రోడ్లు హోరెత్తిపోతున్నాయి.
© 2017,www.logili.com All Rights Reserved.