లోకం పోకడలను తనదైన దృష్టితో విశ్లేషిస్తూ మానవ జీవితాన్ని నిర్దేశిస్తూ విలువలపట్ల, విశ్వాసాల పట్ల ప్రజలకు, పాఠకులకు సరియైన అవగాహన కలిగిస్తున్న గణపతిరావు గారు అభినందనీయులు. "ఇంటిమీద దుప్పటి"తో సంతృప్తిపడని ఈ రచయిత, ఇంకెన్నెన్నో సత్యసుందరమైన సన్నివేశాలను ఆవిష్కరించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గణపతిరావు గారి సత్యసాహిత్య దర్శనం జీవితమంతటి విశాలమైంది. ఆయన కథనాలకు పెట్టుకున్న పేర్లే అందుకు నిదర్శనం.
"మనిషంటే ఎలా ఉంటాడో చెప్పడం కోసం పుట్టింది - తేనె పూసిన కత్తి అన్న మాట - అందుకే మనిషి వలలో చేపలు పడినట్లు అన్నీ పడిపోతున్నాయి"
"కళ్ళు మూసుకుని మేం పాలె౦దుకు తాగుతాం? రాజకీయ నాయకుడు పుట్టాడంటే దోచుకునే హక్కులుంటేనే పుడతాడు"
ఇంతటి కఠోర సత్యం రచయిత పేరులోని 'గణపతి' కే సాధ్యం - అందుకే నా దృష్టిలో మిత్రులు గణపతిరావు రచనలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. నిజానికి ఆయన రాస్తున్నవి ఏవో కథలు కావు. వాస్తవ జీవిత కథనాలు. రచనలో నాటకీయత, కవితాత్మకత, వాస్తవికత అహమహమికంగా ఎదురుపడుతూ పాఠకున్ని నిత్యసత్యానంద పరవశుడ్ని చేస్తున్నాయి. ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో గణపతిరావు గారి వాణి గంగాతరంగిణివలె పరవళ్ళు తొక్కుతూనే ఉంటుందని ఆశిద్దాం.
- బాపురెడ్డి
లోకం పోకడలను తనదైన దృష్టితో విశ్లేషిస్తూ మానవ జీవితాన్ని నిర్దేశిస్తూ విలువలపట్ల, విశ్వాసాల పట్ల ప్రజలకు, పాఠకులకు సరియైన అవగాహన కలిగిస్తున్న గణపతిరావు గారు అభినందనీయులు. "ఇంటిమీద దుప్పటి"తో సంతృప్తిపడని ఈ రచయిత, ఇంకెన్నెన్నో సత్యసుందరమైన సన్నివేశాలను ఆవిష్కరించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గణపతిరావు గారి సత్యసాహిత్య దర్శనం జీవితమంతటి విశాలమైంది. ఆయన కథనాలకు పెట్టుకున్న పేర్లే అందుకు నిదర్శనం. "మనిషంటే ఎలా ఉంటాడో చెప్పడం కోసం పుట్టింది - తేనె పూసిన కత్తి అన్న మాట - అందుకే మనిషి వలలో చేపలు పడినట్లు అన్నీ పడిపోతున్నాయి" "కళ్ళు మూసుకుని మేం పాలె౦దుకు తాగుతాం? రాజకీయ నాయకుడు పుట్టాడంటే దోచుకునే హక్కులుంటేనే పుడతాడు" ఇంతటి కఠోర సత్యం రచయిత పేరులోని 'గణపతి' కే సాధ్యం - అందుకే నా దృష్టిలో మిత్రులు గణపతిరావు రచనలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. నిజానికి ఆయన రాస్తున్నవి ఏవో కథలు కావు. వాస్తవ జీవిత కథనాలు. రచనలో నాటకీయత, కవితాత్మకత, వాస్తవికత అహమహమికంగా ఎదురుపడుతూ పాఠకున్ని నిత్యసత్యానంద పరవశుడ్ని చేస్తున్నాయి. ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో గణపతిరావు గారి వాణి గంగాతరంగిణివలె పరవళ్ళు తొక్కుతూనే ఉంటుందని ఆశిద్దాం. - బాపురెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.