శ్రీమతి కాశీనాథుని సువర్చలాదేవి చిన్నతనంలోనే శ్రీ త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి గురుచరణుల అనుగ్రహంతో శ్రీ విద్య యందు అభినివేశం కలిగి శ్రీవిద్యా సంబంధమైన మంత్రోపదేశాన్ని పొందారు. గురుదేవుల అనుగ్రహంతో మంత్రసాధన కొనసాగిస్తూనే ఎమ్. ఏ. తెలుగులోనూ డిప్లొమా ఇన్ అప్లైడ్ లింగ్విస్టిక్సులోను పట్టభద్రురాలై తరువాత శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు రాజతరంగిణి ఆధారంగా రాసిన నవలాషట్కాoలో ఒకటైన భ్రమరవాసిని అనే ఉపనిషత్సదృశ నవల మీద ఎమ్. ఫీల్. చేశారు.
స్టాన్లీ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం శాఖాధ్యక్షురాలిగా పనిచేసి రిటైరయినారు. ఆఖరి మజిలి (ఎమెస్కో ప్రచురణ) కేదారగౌళ (దేశి సంస్థ) రాగసంద్య (ఆంధ్రావారపత్రిక) శ్రుతకీర్తి (ఆంధ్రజ్యోతి) ఇందుమతి స్వయంవరం (స్వాతి అనుబంధ నవల) శరత్పుర్ణిమ మొదలైన నవలాలే కాక చిన్న కథలు సాహిత్యవ్యాసాలు వివిధ పత్రికలలో ఆమె ఎన్నో రాశారు.
- కాశీనాథుని సువర్చలా దేవి