'సౌశీల్య ద్రౌపది' నవల ప్రధానంగా వ్యాసభారతము, కవిత్రయ భారతాల ఆధారంగా రచించినది. అక్కడక్కడా, అవసరాన్ని బట్టి ఔచిత్యాన్ని పాటిస్తూ, కల్పనలు చేశాను. భారతీయ ధర్మం ఆద్యంతాలు లేనిది. ఈ ధర్మం సజీవంగా ఉంటూ, జీవనదిలా నిరంతరం ప్రవహించేందుకు మన పూర్వీకులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అలా మన ధర్మం సజీవంగా నిలవటంలో సాహిత్యం కూడా ప్రధాన పాత్ర వహించేట్టు సాహిత్యాన్ని తీర్చిదిద్దారు. భారతీయ ధర్మానికి పట్టుకొమ్మలు, ప్రాణప్రదమ అనదగ్గ భారత, రామాయణాలను ఏ కాలానికనుగుణంగా, ఆ కాలంవారు కల్పనలు చేసుకుంటూ రచించే వీలు కల్పించారు.
రామాయణ, భారతాది పురాణాలు భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి, మార్గదర్శనం చేసే గ్రంథాలు. ఈ గ్రంథాలలోని పాత్రల ప్రవర్తన వ్యక్తులకు ఆదర్శప్రాయంగా నిలిచి మార్గదర్శనం చేస్తుంది. నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలకు సమాధానాలు లభిస్తాయి.
'సౌశీల్య ద్రౌపది' నవల ప్రధానంగా వ్యాసభారతము, కవిత్రయ భారతాల ఆధారంగా రచించినది. అక్కడక్కడా, అవసరాన్ని బట్టి ఔచిత్యాన్ని పాటిస్తూ, కల్పనలు చేశాను. భారతీయ ధర్మం ఆద్యంతాలు లేనిది. ఈ ధర్మం సజీవంగా ఉంటూ, జీవనదిలా నిరంతరం ప్రవహించేందుకు మన పూర్వీకులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అలా మన ధర్మం సజీవంగా నిలవటంలో సాహిత్యం కూడా ప్రధాన పాత్ర వహించేట్టు సాహిత్యాన్ని తీర్చిదిద్దారు. భారతీయ ధర్మానికి పట్టుకొమ్మలు, ప్రాణప్రదమ అనదగ్గ భారత, రామాయణాలను ఏ కాలానికనుగుణంగా, ఆ కాలంవారు కల్పనలు చేసుకుంటూ రచించే వీలు కల్పించారు. రామాయణ, భారతాది పురాణాలు భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి, మార్గదర్శనం చేసే గ్రంథాలు. ఈ గ్రంథాలలోని పాత్రల ప్రవర్తన వ్యక్తులకు ఆదర్శప్రాయంగా నిలిచి మార్గదర్శనం చేస్తుంది. నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలకు సమాధానాలు లభిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.