"విజయ్! నన్ను ప్రేమిస్తున్నావా?" నేనిక సూటిగా అడగక తప్పలేదు. "భయపడుతున్నావా?" నా కళ్ళలో భయం కనిపించి ఉంటుందతనికి. కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. "కాదా? నువ్వెక్కడ? నేనెక్కడ? మామకూతురినన్న అభిమానంతో నన్ను చదివిస్తున్నావు. నేను పొద్దుటే దండం పెట్టుకునే దేవుడివి నువ్వే! అంతకు మించి నేను ఆశించడం లేదు." ఆశించి కొలిస్తే ఆశించింది మాత్రమే ఇస్తాడట దేవుడు. ఆశించకుండా కొలిస్తే రెండురెట్లు ఎక్కువగా ఇస్తాడట. ఇస్తాడేమో! అర్హత లేనప్పుడు నేను అందుకోను. పిచ్చిపిల్లవి! నీకు అర్హత లేదని నువ్వు అనుకొంటే చాలా? నా సంగతేమిటో నాకు తెలుసు.
ఏం తెలుసు? నువ్వు చాలా అసమాన సౌందర్యవతివని, ఆ సౌందర్యం నన్ను మొదటి చూపులోనే నాది చేసుకోవాలనిపించిందని నీకు తెలుసా? నేనొక నిర్ణయానికి వస్తే దానికి తిరుగులేదన్న సంగతి నీకు తెలుసా? విజయ్ చేతులు ముందుకు చాచి నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని అపురూపంగా చూస్తూ ముగ్ధమందహాసం చేశాడు. "ఇది నా దృష్టిలో ఎంతో అపురూపమైన సంగతి! ఇది చాలా అసందర్భంగా బయటపెట్టాలనుకోలేదు. ఈ సన్నివేశం ఇంత పేలవంగా ఉండాలని అనుకోలేదు. ఏం చెయ్యను? చెప్పేదాకా వదలకపోతివి." ఆడపిల్ల జీవితంలో అపురూప క్షణాలు కావలసినవి! అతడి మాటలు అమృతపు జల్లులు కావలసినవి! కాని, నేనొక చీకటిగుహలో పడిపోయినట్టు నా చుట్టూ భయంకర స్వప్నాలు బుసకొడుతున్నట్టు కంపించిపోయాను.
"విజయ్! నన్ను ప్రేమిస్తున్నావా?" నేనిక సూటిగా అడగక తప్పలేదు. "భయపడుతున్నావా?" నా కళ్ళలో భయం కనిపించి ఉంటుందతనికి. కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. "కాదా? నువ్వెక్కడ? నేనెక్కడ? మామకూతురినన్న అభిమానంతో నన్ను చదివిస్తున్నావు. నేను పొద్దుటే దండం పెట్టుకునే దేవుడివి నువ్వే! అంతకు మించి నేను ఆశించడం లేదు." ఆశించి కొలిస్తే ఆశించింది మాత్రమే ఇస్తాడట దేవుడు. ఆశించకుండా కొలిస్తే రెండురెట్లు ఎక్కువగా ఇస్తాడట. ఇస్తాడేమో! అర్హత లేనప్పుడు నేను అందుకోను. పిచ్చిపిల్లవి! నీకు అర్హత లేదని నువ్వు అనుకొంటే చాలా? నా సంగతేమిటో నాకు తెలుసు. ఏం తెలుసు? నువ్వు చాలా అసమాన సౌందర్యవతివని, ఆ సౌందర్యం నన్ను మొదటి చూపులోనే నాది చేసుకోవాలనిపించిందని నీకు తెలుసా? నేనొక నిర్ణయానికి వస్తే దానికి తిరుగులేదన్న సంగతి నీకు తెలుసా? విజయ్ చేతులు ముందుకు చాచి నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని అపురూపంగా చూస్తూ ముగ్ధమందహాసం చేశాడు. "ఇది నా దృష్టిలో ఎంతో అపురూపమైన సంగతి! ఇది చాలా అసందర్భంగా బయటపెట్టాలనుకోలేదు. ఈ సన్నివేశం ఇంత పేలవంగా ఉండాలని అనుకోలేదు. ఏం చెయ్యను? చెప్పేదాకా వదలకపోతివి." ఆడపిల్ల జీవితంలో అపురూప క్షణాలు కావలసినవి! అతడి మాటలు అమృతపు జల్లులు కావలసినవి! కాని, నేనొక చీకటిగుహలో పడిపోయినట్టు నా చుట్టూ భయంకర స్వప్నాలు బుసకొడుతున్నట్టు కంపించిపోయాను.© 2017,www.logili.com All Rights Reserved.