'విజయానికి అయిదు మెట్లు' నుంచీ 'టీన్స్ పిల్లల పెంపకం' దాక నా వ్యక్తిత్వవికాస పుస్తకాల్లో, Subject matter తో పాటూ నా అనుభవాలూ, కథలూ కూడా వ్రాస్తూ వచ్చాను. మిగతా రచయితల పుస్తకాలకీ, వీటికీ తేడా బహుశా అదే అనుకుంటాను. దురదృష్టవశాత్తూ, ఇటువంటి పెర్సనాలిటీ డెవలప్ మెంట్ పుస్తకాలు పిల్లలు చదవరు. కానీ ఈ పుస్తకాల్లో కొన్ని కథలు పిల్లలలకి ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఇస్తాయి. అన్నిటినీ క్రోడీకరించి ఒక చోట చేరిస్తే, వాటిని పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనే ఈ పుస్తకం.
నా వివిధ వ్యక్తిత్వ పుస్తకాల్లో నుంచి ఏరి కూర్చిన కథల సమాహారం ఇది. ఇందులో కొన్ని విదేశాలకి సంబంధించిన పురాతన గాధలు, మరి కొన్ని బౌద్ధానికి సంబంధించిన పుస్తకాల్లోంచి, ఇంకా కొన్ని ఇంటర్నెట్ నుంచీ స్వీకరించినవి. చాల వరకూ నావి.
పెద్దల్లు పిల్లలకి బెడ్ రూమ్ కథలు చెప్పటం తగ్గిపోయింది. 'అసలు మాకు తెలుస్తే కదా చెప్పటానికి' అంటున్నారు కొందరు. ఈ పుస్తకం ఆ లోటు తీరుస్తుందనే ఆశిస్తూ..
- యండమూరి వీరేంద్రనాథ్
'విజయానికి అయిదు మెట్లు' నుంచీ 'టీన్స్ పిల్లల పెంపకం' దాక నా వ్యక్తిత్వవికాస పుస్తకాల్లో, Subject matter తో పాటూ నా అనుభవాలూ, కథలూ కూడా వ్రాస్తూ వచ్చాను. మిగతా రచయితల పుస్తకాలకీ, వీటికీ తేడా బహుశా అదే అనుకుంటాను. దురదృష్టవశాత్తూ, ఇటువంటి పెర్సనాలిటీ డెవలప్ మెంట్ పుస్తకాలు పిల్లలు చదవరు. కానీ ఈ పుస్తకాల్లో కొన్ని కథలు పిల్లలలకి ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఇస్తాయి. అన్నిటినీ క్రోడీకరించి ఒక చోట చేరిస్తే, వాటిని పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనే ఈ పుస్తకం. నా వివిధ వ్యక్తిత్వ పుస్తకాల్లో నుంచి ఏరి కూర్చిన కథల సమాహారం ఇది. ఇందులో కొన్ని విదేశాలకి సంబంధించిన పురాతన గాధలు, మరి కొన్ని బౌద్ధానికి సంబంధించిన పుస్తకాల్లోంచి, ఇంకా కొన్ని ఇంటర్నెట్ నుంచీ స్వీకరించినవి. చాల వరకూ నావి. పెద్దల్లు పిల్లలకి బెడ్ రూమ్ కథలు చెప్పటం తగ్గిపోయింది. 'అసలు మాకు తెలుస్తే కదా చెప్పటానికి' అంటున్నారు కొందరు. ఈ పుస్తకం ఆ లోటు తీరుస్తుందనే ఆశిస్తూ.. - యండమూరి వీరేంద్రనాథ్© 2017,www.logili.com All Rights Reserved.