తిరిగి యిన్నేళ్ళ కు మాదిరెడ్డి సులోచన నవలలు మీ ముందుకు వచ్చాయి. దాదాపు ఏభై యేళ్ళ క్రితం అచ్చమైన తెలంగాణా వాతావరణం పొందికైన మానవ సంబంధాలూ కలగలిపి చక్కని యితివృత్తాలు ఆమె సాహిత్యంలో కనిపిస్తాయి. డెబ్భై పైగా నవలలు ఆమె రచించారు. వాసిలోనూ రాశిలోను కూడా సులోచన రచనలు ఎన్నతగినవే. ఆమె ప్రమాదవశాత్తు అకాలమరణం పాలు కాకుండావుంటే మరెన్ని మంచి నవలలు రాసి వుండేవారోననేది ఊహకు మాత్రమే మిగిల్చి వెళ్లిపోయారు.
ఇప్పుడు అంటే నూతన సహస్రాబ్ది తొలిదశకంలో యీ నవలల్ని చదువుతున్నపుడు కొన్ని కొన్ని సందర్భాలలో పాఠకులకు అసహజంగా వున్నా భావన కలిగే అవకాశం వుంది. ఎందుకంటే గడచిన ఏభై సంవత్సరాలలో ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనాటి రూపాయికి నేటి రూపాయికి పొంతన లేదు. కొన్ని వూళ్ళపేర్లు కొన్ని మాటల అర్దాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది. దూరాలు తగ్గిపోయాయి. భూగోళం గుప్పెట్లో వొదిగిపోయింది. ఆనాడు వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. నేడు అది చిల్లర డబ్బు. కనుక ఇలాంటివి మాదిరెడ్డి నవలలో తారసపడినప్పుడు విజ్ఞలైన మా పాఠకులకు కాలంతో అన్వయించుకుని అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాము.
- మాదిరెడ్డి సులోచన