నేను ఒక రాజును కనక నా కథ వినిపిస్తున్నానా? ఏమో నాకే సరిగా తెలియటంలేదు. అసలు వాస్తవానికి నేను ఒక రాజునా? కాదు, నేను ఒకప్పుడు మాత్రమే రాజును. రాజు - రాణి కథలు ప్రజలు ఇష్టంగా వింటారు. సాధారణ ప్రజానీకం వారి ప్రేమ గాథలు వింటూ రసాస్వాదన చేస్తుంటారు. ప్రసిద్ధులైన కవులు వీరి కథల ఆధారంగా కవితలల్లుతూ ఉంటారు.
నాది కూడా ఒక ప్రేమ కథ - కాదు, కాదు! అది ఏ రకం కథో నాకూ తెలియదు. కవుల హృదయాలను రంజింపచేసే విషయాలేవీ అందులో లేవు. ఇది ఒక రాజు కథ కాబట్టి నేనీరోజు ఈ కథ వినిపించటంలేదు. ఈ కథామూలంలో ఏ విధమయిన అభిమానం గానీ, అహంకారం గానీ, ఏ విషయ ప్రదర్శన గానీ లేవు. ఇవి కేవలం రాజ వస్త్రాల పీలికలు మాత్రమే. ఎవరైనా వీటిని ఎందుకు ప్రదర్శిస్తారు?
రాజవంశంలో జన్మించిన కారణంగా రాజునయ్యాను. అదే అధికారంతో జీవించాను. ఇందులో నా గొప్పతనమూ లేదు, నా దోషమూ లేదు. హస్తినాపురం మహారాజు నహుషుని కుమారునిగా భగవంతుడు నాకు ఈ జన్మ ప్రసాదించాడు. తండ్రి తర్వాత రాజసింహాసనం అధిష్టించాను. ఇందులో గొప్ప తనం ఏముంది? రాజ ప్రసాదపు గోపురం మీద కూర్చున్న కాకిని సైతం ప్రజలు కుతూహలంతో చూస్తారు.
- విష్ణు సుఖారామ్ ఖండేకర్

Features
: Yayati
: Vishnu Sakharam Khandekar S Yarlagadda Lakshmi Prasad