ఇది శ్రీశ్రీ ఛాయాచిత్రాల సంకలనం. ఇది ఛాయరాజ్ ఫోటోగ్రఫీ కాదు... ఎక్స్ రే ఫోటోగ్రఫీ. ఛాయరాజ్ ఉద్యమాల నిప్పునుండి పుట్టిన అక్షరం. ఛాయరాజ్ ఉద్యమాలకు ఉప్పందించిన అక్షరం. ఆ అక్షరజీవాగ్ని రసస్పర్శ అనుభూతులు వివిధ ప్రముఖులవి పాఠకులకోసం ఇక్కడ ఇలా...
ఛాయరాజ్ కవిత్వంలో ప్రధానాంశం మట్టితో ఆయనకున్న ముడి. ఆ ప్రవృత్తిని గ్రామీణ దేశీయతను అభివ్యక్తం చేసే రీతిలో ఛాయరాజ్ రచనలు సాగాయి. ఒకచోట 'విత్తనాల హత్య' జరిగిందంటారు. గుండెలను చీల్చే అభివ్యక్తది. రచనారీతిలో స్పష్టత, భావప్రకటనలో నిర్దిష్టత నన్ను బాగా పట్టుకున్నాయి.
- సి నారాయణ రెడ్డి
సిమనోవ్ నుండి శివసాగర్ దాకా 'నాకోసం ఎదురు చూడు' అని చెప్పారుకాని, ఆ ఎదురు చూసే స్త్రీ హృదయం ఏమిటో, ఆ హృదయంలో ఏ బడబాగ్నులున్నాయో వసంతా కన్నాభిరన్ చెప్పింది. ఇప్పుడు ఛాయరాజ్ చెబుతున్నాడు... క్రమంగా వయక్తిక అనుబంధాలను రాజకీయ బంధాలుగా చైతన్యీకరించి చూపే ప్రయత్నం చేశాడు. కనుక ఈ కవిత విప్లవవాద, స్త్రీవాద పాలిమిక్స్ లో చోటుచేసుకుంటుందని కూడా నిరీక్షించవచ్చు.
- వరవరావు
ఇది శ్రీశ్రీ ఛాయాచిత్రాల సంకలనం. ఇది ఛాయరాజ్ ఫోటోగ్రఫీ కాదు... ఎక్స్ రే ఫోటోగ్రఫీ. ఛాయరాజ్ ఉద్యమాల నిప్పునుండి పుట్టిన అక్షరం. ఛాయరాజ్ ఉద్యమాలకు ఉప్పందించిన అక్షరం. ఆ అక్షరజీవాగ్ని రసస్పర్శ అనుభూతులు వివిధ ప్రముఖులవి పాఠకులకోసం ఇక్కడ ఇలా... ఛాయరాజ్ కవిత్వంలో ప్రధానాంశం మట్టితో ఆయనకున్న ముడి. ఆ ప్రవృత్తిని గ్రామీణ దేశీయతను అభివ్యక్తం చేసే రీతిలో ఛాయరాజ్ రచనలు సాగాయి. ఒకచోట 'విత్తనాల హత్య' జరిగిందంటారు. గుండెలను చీల్చే అభివ్యక్తది. రచనారీతిలో స్పష్టత, భావప్రకటనలో నిర్దిష్టత నన్ను బాగా పట్టుకున్నాయి. - సి నారాయణ రెడ్డి సిమనోవ్ నుండి శివసాగర్ దాకా 'నాకోసం ఎదురు చూడు' అని చెప్పారుకాని, ఆ ఎదురు చూసే స్త్రీ హృదయం ఏమిటో, ఆ హృదయంలో ఏ బడబాగ్నులున్నాయో వసంతా కన్నాభిరన్ చెప్పింది. ఇప్పుడు ఛాయరాజ్ చెబుతున్నాడు... క్రమంగా వయక్తిక అనుబంధాలను రాజకీయ బంధాలుగా చైతన్యీకరించి చూపే ప్రయత్నం చేశాడు. కనుక ఈ కవిత విప్లవవాద, స్త్రీవాద పాలిమిక్స్ లో చోటుచేసుకుంటుందని కూడా నిరీక్షించవచ్చు. - వరవరావు© 2017,www.logili.com All Rights Reserved.