ఇది నూటయాభయ్యవ జయంతి సందర్భంగా మూడు యాభాయిల గురజాడ మహాకవికి, రెండు యాభాయిల శ్రీశ్రీ మహాకవి, యాభయి మంది అమర సాహితీవేత్తలు సమర్పిస్తున్న అక్షర నివాళి.
'అడుగుజాడ గురజాడది
అది భావికి బాట
మనలో వెధవాయత్వం
మరిపించే పాట'
ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజాని కొక చరిత్రా, ఆ చరిత్ర కొక పరిణామం వుంటాయి. సామాజిక చారిత్రక పరిణామగమనంలో కవియొక్క సాహిత్యస్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రతిభాశాలీ అయితే ఈ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవపంథాలో వేగం సాధించిన మహాకవి గురజాడ అప్పారావుకి నేను నమస్కరిస్తున్నాను.
ఇది నూటయాభయ్యవ జయంతి సందర్భంగా మూడు యాభాయిల గురజాడ మహాకవికి, రెండు యాభాయిల శ్రీశ్రీ మహాకవి, యాభయి మంది అమర సాహితీవేత్తలు సమర్పిస్తున్న అక్షర నివాళి. 'అడుగుజాడ గురజాడది అది భావికి బాట మనలో వెధవాయత్వం మరిపించే పాట' ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజాని కొక చరిత్రా, ఆ చరిత్ర కొక పరిణామం వుంటాయి. సామాజిక చారిత్రక పరిణామగమనంలో కవియొక్క సాహిత్యస్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రతిభాశాలీ అయితే ఈ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవపంథాలో వేగం సాధించిన మహాకవి గురజాడ అప్పారావుకి నేను నమస్కరిస్తున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.