ఒకప్పుడు సాహిత్యానికి ముడిసరుకు భక్తీ మాత్రమే. తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల, రంగాజామ్మ మొదలైన ప్రాచీనాంధ్ర కవయిత్రులు చక్కటి పద్య కవితలు రచించారు. స్త్రీ విద్యాధికురాలై ప్రగతి పథంలో అడుగు పెట్టిన తర్వాత సామాజిక సమస్యలు, స్వాతంత్రోద్యమ కవితలతో పాటు విభిన్నమైన వస్తువులనెంచుకొని చక్కటి అభివ్యక్తితో రచనలు చేశారు. అభ్యుదయ దృక్పధంతో, హేతువాద ధోరణిలో కవితలు రాసారు. ఆధునిక స్త్రీ పితృస్వామ్య వ్యవస్థను నిరసిస్తూ కవితాత్మకంగా తన్ను తాను ఆవిష్కరించుకుంది. అంటరానితనాన్ని, అవమానాన్ని ధిక్కరించింది.
కవితలకు స్ఫూర్తినిచ్చి కవితావస్తువులుగా నీరాజనాలందుకున్న నీరజాక్షులు కవితలెందుకు ఎక్కువగా రాయలేదు? రాయలేకపోయారా? రాయనివ్వలేదా? అన్న ప్రశ్నలకు జవాబే - ఈ ముద్ర - వందమంది వనితల కవితల సంకలనం. తెలుగు సాహిత్యం పైన స్త్రీ వేసిన కవితా ముద్ర.
ఒకప్పుడు సాహిత్యానికి ముడిసరుకు భక్తీ మాత్రమే. తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల, రంగాజామ్మ మొదలైన ప్రాచీనాంధ్ర కవయిత్రులు చక్కటి పద్య కవితలు రచించారు. స్త్రీ విద్యాధికురాలై ప్రగతి పథంలో అడుగు పెట్టిన తర్వాత సామాజిక సమస్యలు, స్వాతంత్రోద్యమ కవితలతో పాటు విభిన్నమైన వస్తువులనెంచుకొని చక్కటి అభివ్యక్తితో రచనలు చేశారు. అభ్యుదయ దృక్పధంతో, హేతువాద ధోరణిలో కవితలు రాసారు. ఆధునిక స్త్రీ పితృస్వామ్య వ్యవస్థను నిరసిస్తూ కవితాత్మకంగా తన్ను తాను ఆవిష్కరించుకుంది. అంటరానితనాన్ని, అవమానాన్ని ధిక్కరించింది. కవితలకు స్ఫూర్తినిచ్చి కవితావస్తువులుగా నీరాజనాలందుకున్న నీరజాక్షులు కవితలెందుకు ఎక్కువగా రాయలేదు? రాయలేకపోయారా? రాయనివ్వలేదా? అన్న ప్రశ్నలకు జవాబే - ఈ ముద్ర - వందమంది వనితల కవితల సంకలనం. తెలుగు సాహిత్యం పైన స్త్రీ వేసిన కవితా ముద్ర.© 2017,www.logili.com All Rights Reserved.