Title | Price | |
Prasnalu Javabulu | Rs.100 | In Stock |
ఫేస్ బుక్ లో 'కవిత్వం' పేరుతో తిలక్ స్వీ తదితర మిత్రులు ఒక గ్రూపు నడిపించారు. గ్రూపులో నెల రోజుల పాటు కవిత్వం మీద ఒక 'కాలం' నిర్వహించాలని నన్ను అడిగారు. రెగ్యులర్ గా కాలం రాసే ఓపిక, సరుకు నాలో లేవని గతంలో అనుకునే వాడిని. ప్రింట్ మీడియం లో మిత్రులు సజెస్ట్ చేసినా, రాసే ధైర్యం చేయలేకపోయానందుకే. ఈ కాలం ప్రత్యేకించి కవిత్వం మీద అనే సరికి మనసు మెత్తబడింది. 'విమోచన' పక్ష పత్రికలో ఒక సాహిత్యం పేజీ పెట్టి లక్నారెడ్డి, నారాయణ స్వామి, యెన్నార్ బోదనం, జనజ్వాల, తోట మహాదేవ, యెన్ తిర్మల్, రోషన్ షుకూర్ వంటి పలువురు యువ స్నేహితుల్ని ప్రోత్సాహించి రాయించడం, తరువాత ఇరానీ హోటళ్ళలో తేనీటి కబుర్లలో యింప్రాప్చూ ఉపన్యాసాలు... అవన్నీ గుర్తొచ్చాయి. సాహిత్య కాలం అయితే రాయడం సాధ్యమే అనిపించింది. పనికొచ్చే పని కూడా అనిపించింది.
అందులోనూ ఎవరో అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వాల్సి ఉంటుందని అన్నారు. అంటే, నేను సబ్జెక్ట్ వెదుక్కోనక్కర్లేదు. రోజూ సబ్జెక్టే నన్ను వెదుక్కుని వస్తుంది. అలా వచ్చి నా కాలరు పట్టుకున్న వాటిలో నాకు తెలీనివి ఏమైనా ఉంటే.. మనకేటి సిగ్గు.. తెలీదు అనేస్తే పోయె.. అని భోరసా. ఈ విధముగా నన్ను నేను పలు రకాలుగా ఒప్పించుకొని తిలక్ తో సరే అనేశాను. ఇంకేం.. జీవితంలో మొదటి సారి నేనొక కాలం నిర్వహించాను. మళ్ళీ 'విమోచన' అనుభవమే చెప్పాలి. 'విమోచన'లో 'సంగతీ సందర్భం' పదిహేను రోజులకోసారి ఒక పొలిటికల్ కాలం రాశాను. దాని తరువాత కాలం రాయడం ఇదే.
- హెచ్చార్కె
ఫేస్ బుక్ లో 'కవిత్వం' పేరుతో తిలక్ స్వీ తదితర మిత్రులు ఒక గ్రూపు నడిపించారు. గ్రూపులో నెల రోజుల పాటు కవిత్వం మీద ఒక 'కాలం' నిర్వహించాలని నన్ను అడిగారు. రెగ్యులర్ గా కాలం రాసే ఓపిక, సరుకు నాలో లేవని గతంలో అనుకునే వాడిని. ప్రింట్ మీడియం లో మిత్రులు సజెస్ట్ చేసినా, రాసే ధైర్యం చేయలేకపోయానందుకే. ఈ కాలం ప్రత్యేకించి కవిత్వం మీద అనే సరికి మనసు మెత్తబడింది. 'విమోచన' పక్ష పత్రికలో ఒక సాహిత్యం పేజీ పెట్టి లక్నారెడ్డి, నారాయణ స్వామి, యెన్నార్ బోదనం, జనజ్వాల, తోట మహాదేవ, యెన్ తిర్మల్, రోషన్ షుకూర్ వంటి పలువురు యువ స్నేహితుల్ని ప్రోత్సాహించి రాయించడం, తరువాత ఇరానీ హోటళ్ళలో తేనీటి కబుర్లలో యింప్రాప్చూ ఉపన్యాసాలు... అవన్నీ గుర్తొచ్చాయి. సాహిత్య కాలం అయితే రాయడం సాధ్యమే అనిపించింది. పనికొచ్చే పని కూడా అనిపించింది. అందులోనూ ఎవరో అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వాల్సి ఉంటుందని అన్నారు. అంటే, నేను సబ్జెక్ట్ వెదుక్కోనక్కర్లేదు. రోజూ సబ్జెక్టే నన్ను వెదుక్కుని వస్తుంది. అలా వచ్చి నా కాలరు పట్టుకున్న వాటిలో నాకు తెలీనివి ఏమైనా ఉంటే.. మనకేటి సిగ్గు.. తెలీదు అనేస్తే పోయె.. అని భోరసా. ఈ విధముగా నన్ను నేను పలు రకాలుగా ఒప్పించుకొని తిలక్ తో సరే అనేశాను. ఇంకేం.. జీవితంలో మొదటి సారి నేనొక కాలం నిర్వహించాను. మళ్ళీ 'విమోచన' అనుభవమే చెప్పాలి. 'విమోచన'లో 'సంగతీ సందర్భం' పదిహేను రోజులకోసారి ఒక పొలిటికల్ కాలం రాశాను. దాని తరువాత కాలం రాయడం ఇదే. - హెచ్చార్కె© 2017,www.logili.com All Rights Reserved.