శ్రీ నాగినేని లీలాప్రసాద్ కుటుంబం బలమైన నేపథ్యం కలది. చదువులలో సారమెల్ల చదివి ఆనందించటంతో త్రుప్తి చెందక, ఆ ఆనందాన్ని అందరితోనూ పంచుకోవాలనే చికీర్ష ఉన్న శ్రీ లీలాప్రసాద్ ఇప్పుడు యక్షప్రశ్నలను వివరణాత్మకంగా అందిస్తున్నారు. చిన్నపిల్లలు సహజమైన జిజ్ఞాసతో ప్రశ్నమీద ప్రశ్న వేస్తే, సమాధానాలు చెప్పలేని పెద్దలు - వారిని "నీ యక్షప్రశ్నలతో విసిగించకు" అని కసురుకోవటం మనం తరచూ చూస్తున్న దృశ్యం. మరి మళ్ళీ ఈ పిల్లలు "యక్షప్రశ్నలంటే ఏమిటి?" అని అడిగితే...!
అందుకే పిల్లలే కాదు, ఇవి తెలియని పెద్దలు కూడా, మూలగ్రంథాలను చదివే అవకాశం ఉండకపోతే, ఇదిగో ఈ పుస్తకాన్ని చదివి తెలుసుకోవచ్చు. ఈ ప్రశ్నలు ఒక ధర్మరాజు ద్వారా, ధర్మసారం ఆవిష్కరింపబడటానికి యక్షుడు వేసినవి. వాకోవాక్యంగా సాగిన ఈ ఘట్టంలో భారతీయ సంస్కృతి ప్రతిఫలించింది. శ్రీ లీలాప్రసాద్ ఆయాప్రశ్నలకు ఇవ్వబడిన సమాధానాలకు సరళమైన వివరణ ఇవ్వటంతోపాటు, వాటికి ప్రోద్బలకంగా కొన్ని లోకవ్రుత్తాలను కూడా అనుసంధానం చేశారు. ఇది మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ తరహా రచనల విలువ తెలిసినవారందరూ దీనిని ఆహ్వానించి, సమాదరించాలి. భారతీయ సంస్కృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలి.
- కొంపెల్ల రామకృష్ణమూర్తి
శ్రీ నాగినేని లీలాప్రసాద్ కుటుంబం బలమైన నేపథ్యం కలది. చదువులలో సారమెల్ల చదివి ఆనందించటంతో త్రుప్తి చెందక, ఆ ఆనందాన్ని అందరితోనూ పంచుకోవాలనే చికీర్ష ఉన్న శ్రీ లీలాప్రసాద్ ఇప్పుడు యక్షప్రశ్నలను వివరణాత్మకంగా అందిస్తున్నారు. చిన్నపిల్లలు సహజమైన జిజ్ఞాసతో ప్రశ్నమీద ప్రశ్న వేస్తే, సమాధానాలు చెప్పలేని పెద్దలు - వారిని "నీ యక్షప్రశ్నలతో విసిగించకు" అని కసురుకోవటం మనం తరచూ చూస్తున్న దృశ్యం. మరి మళ్ళీ ఈ పిల్లలు "యక్షప్రశ్నలంటే ఏమిటి?" అని అడిగితే...! అందుకే పిల్లలే కాదు, ఇవి తెలియని పెద్దలు కూడా, మూలగ్రంథాలను చదివే అవకాశం ఉండకపోతే, ఇదిగో ఈ పుస్తకాన్ని చదివి తెలుసుకోవచ్చు. ఈ ప్రశ్నలు ఒక ధర్మరాజు ద్వారా, ధర్మసారం ఆవిష్కరింపబడటానికి యక్షుడు వేసినవి. వాకోవాక్యంగా సాగిన ఈ ఘట్టంలో భారతీయ సంస్కృతి ప్రతిఫలించింది. శ్రీ లీలాప్రసాద్ ఆయాప్రశ్నలకు ఇవ్వబడిన సమాధానాలకు సరళమైన వివరణ ఇవ్వటంతోపాటు, వాటికి ప్రోద్బలకంగా కొన్ని లోకవ్రుత్తాలను కూడా అనుసంధానం చేశారు. ఇది మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ తరహా రచనల విలువ తెలిసినవారందరూ దీనిని ఆహ్వానించి, సమాదరించాలి. భారతీయ సంస్కృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలి. - కొంపెల్ల రామకృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.