ఆశ్చర్యంగా రాసే ఆరుద్ర గురించి ఆంధ్రదేశానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆరుద్ర తెలుగు సినిమాలకి పాటలు మాత్రమే రాసినట్లుగా భావించే వారికి ఆరుద్ర సీరియస్ పోయెట్రీని గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పని మహాకవి శ్రీశ్రీ, దాశరథి ఆనాడెప్పుడో చేశారు. మళ్ళీ ఇప్పుడు, ఇన్నాళ్ళకి ఎప్పుడో ఆరుద్ర రాసిన పోయెట్రీని గురించి ఈ గ్రంథం రాయడానికి సాహసించాను.
1942వ సంవత్సరం నుండి ఆరుద్ర రచించిన కవితలన్నింటినీ కూడా ఈ పరిశీలనలో విశ్లేషించి వ్యాఖ్యానించడం జరిగింది. తన కవితల్లో సిన్సియర్ గా సామ్యవాదాన్ని సమర్థించిన ఆరుద్ర సామ్యవాది మాత్రమే కాక ఎంతో సౌమ్యవాది కూడా. అక్షరాలలో పరుషాలుండకూడదని ఆయన సినీవాలిలో రాసినట్లుగానే నిజ జీవితంలో స్నేహశీలిగా, మృదుభాషిగా పేరు పొందారు. సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాసిన ఆ మహా పరిశోధకుడి కవిత్వాన్ని గురించి రచించబడిన ఈ సిద్ధాంతవ్యాసం 1989 సం. ఫిబ్రవరి నెలలో నాగార్జున విశ్వవిద్యాలయం వారికి పి.హెచ్.డి పట్టం కోసం సమర్పించబడింది. ఆరుద్ర ప్రకటించిన కవితా సంకలనంలో లేని కవితలు ఈ గ్రంథం చివర అనుబంధంలో చేర్చబడినాయి. సహృదయులైన పాఠక మహాశయులీ గ్రంథాన్ని సముచితంగా ఆదరిస్తారని ఆశిస్తాను.
- డా.ఆర్.నరసింహారావు
ఆశ్చర్యంగా రాసే ఆరుద్ర గురించి ఆంధ్రదేశానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆరుద్ర తెలుగు సినిమాలకి పాటలు మాత్రమే రాసినట్లుగా భావించే వారికి ఆరుద్ర సీరియస్ పోయెట్రీని గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పని మహాకవి శ్రీశ్రీ, దాశరథి ఆనాడెప్పుడో చేశారు. మళ్ళీ ఇప్పుడు, ఇన్నాళ్ళకి ఎప్పుడో ఆరుద్ర రాసిన పోయెట్రీని గురించి ఈ గ్రంథం రాయడానికి సాహసించాను. 1942వ సంవత్సరం నుండి ఆరుద్ర రచించిన కవితలన్నింటినీ కూడా ఈ పరిశీలనలో విశ్లేషించి వ్యాఖ్యానించడం జరిగింది. తన కవితల్లో సిన్సియర్ గా సామ్యవాదాన్ని సమర్థించిన ఆరుద్ర సామ్యవాది మాత్రమే కాక ఎంతో సౌమ్యవాది కూడా. అక్షరాలలో పరుషాలుండకూడదని ఆయన సినీవాలిలో రాసినట్లుగానే నిజ జీవితంలో స్నేహశీలిగా, మృదుభాషిగా పేరు పొందారు. సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాసిన ఆ మహా పరిశోధకుడి కవిత్వాన్ని గురించి రచించబడిన ఈ సిద్ధాంతవ్యాసం 1989 సం. ఫిబ్రవరి నెలలో నాగార్జున విశ్వవిద్యాలయం వారికి పి.హెచ్.డి పట్టం కోసం సమర్పించబడింది. ఆరుద్ర ప్రకటించిన కవితా సంకలనంలో లేని కవితలు ఈ గ్రంథం చివర అనుబంధంలో చేర్చబడినాయి. సహృదయులైన పాఠక మహాశయులీ గ్రంథాన్ని సముచితంగా ఆదరిస్తారని ఆశిస్తాను. - డా.ఆర్.నరసింహారావు© 2017,www.logili.com All Rights Reserved.