కవి ఆలూరి బైరాగిగారు ప్రేమ అన్ని పార్శ్వలను ఒక వ్యక్తిగానూ, దార్సకునిగానూ లోతుగా పరిశీలించారు. హిందీ, తెలుగు భాషల్లో ఛందోబద్దంగా, వచన కవితా రూపంలో, రసరాగరంజితంగా, మృదుమధుర పరిశోభితంగా వెలువడిన వీరి ప్రేమ గీతాలు, కవితలు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తాయి.
ఈ కవితల్లో భైరాగిగారి ప్రణయ భావనల్లో తొంగిచూసేవారి వ్యక్తిగత జీవితపు నీలి నీడలు, భావచిత్రసంరంభాలైన వర్ణనా వైదుష్యంతో రమ్యాతిరమ్యంగా హృదయపు లోతులను స్మృశి౦చే రీతిలో 'స భూతో' అన్న చందంగా అక్షర రూపం దాల్చాయి.
ప్రేమ స్వరూపాన్ని దర్శిస్తూ తన వ్యక్తిగత పరిధుల్ని దాటి తాత్వికునిగా బైరాగిగారు ప్రేమ అమరత్వాన్ని, పవిత్రతనూ, అపవిత్రతనూ, దాని భౌతిక, ఆత్మిక స్వరూపాలనూ తన 'ప్రేమ కవితలలో' ఈ విధంగా వర్ణించారు.
"సావిత్రీ సత్యవంతులు, నల దమయంతులు
మరణ మహోరగపు కోరలు పీకి, మార్కండేయునిలా
అజేయునిగా నిలిచిన ప్రేమ...
అసీరియా, అరేబియా తరుణుల మ్రుదులోత్సంగాల
దివ్యాంగనల కుసుమ గంధ బంధుర సుందరాంగాంగాల
పన్నీరై పెరిగిన ప్రేమ, కన్నీరై కరిగిన ప్రేమ...
పాపలవంటి పాటల గొంతు నులిమి,
బావిలో విసిరి వేసిన దుర్భాగ్య దరిద్రురాలి వంటి ప్రేమ
దుర్భర గర్భవహ్నిలో శోకాశ్రువులింకిపోయి
నెత్తుటి చనుబాలు గ్రక్కి
శిరసు తెగినా ప్రాణం పోక గిలగిల తన్నుకునే
మొండెం వంటి మొండి ప్రేమ
పడువుకత్తియ మోజుల గాజుల సడిలో
సుఖరోగాల చీమునెత్తుటి చిత్తడిలో
నాచులాగ, పాచిలాగ పెరుగుతున్నది
శాస్త్రక్రియకు లొంగని రాచపుండై ఎదుగుచున్నది."
- ఆచార్య ఆదేశ్వరరావు
కవి ఆలూరి బైరాగిగారు ప్రేమ అన్ని పార్శ్వలను ఒక వ్యక్తిగానూ, దార్సకునిగానూ లోతుగా పరిశీలించారు. హిందీ, తెలుగు భాషల్లో ఛందోబద్దంగా, వచన కవితా రూపంలో, రసరాగరంజితంగా, మృదుమధుర పరిశోభితంగా వెలువడిన వీరి ప్రేమ గీతాలు, కవితలు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తాయి. ఈ కవితల్లో భైరాగిగారి ప్రణయ భావనల్లో తొంగిచూసేవారి వ్యక్తిగత జీవితపు నీలి నీడలు, భావచిత్రసంరంభాలైన వర్ణనా వైదుష్యంతో రమ్యాతిరమ్యంగా హృదయపు లోతులను స్మృశి౦చే రీతిలో 'స భూతో' అన్న చందంగా అక్షర రూపం దాల్చాయి. ప్రేమ స్వరూపాన్ని దర్శిస్తూ తన వ్యక్తిగత పరిధుల్ని దాటి తాత్వికునిగా బైరాగిగారు ప్రేమ అమరత్వాన్ని, పవిత్రతనూ, అపవిత్రతనూ, దాని భౌతిక, ఆత్మిక స్వరూపాలనూ తన 'ప్రేమ కవితలలో' ఈ విధంగా వర్ణించారు. "సావిత్రీ సత్యవంతులు, నల దమయంతులు మరణ మహోరగపు కోరలు పీకి, మార్కండేయునిలా అజేయునిగా నిలిచిన ప్రేమ... అసీరియా, అరేబియా తరుణుల మ్రుదులోత్సంగాల దివ్యాంగనల కుసుమ గంధ బంధుర సుందరాంగాంగాల పన్నీరై పెరిగిన ప్రేమ, కన్నీరై కరిగిన ప్రేమ... పాపలవంటి పాటల గొంతు నులిమి, బావిలో విసిరి వేసిన దుర్భాగ్య దరిద్రురాలి వంటి ప్రేమ దుర్భర గర్భవహ్నిలో శోకాశ్రువులింకిపోయి నెత్తుటి చనుబాలు గ్రక్కి శిరసు తెగినా ప్రాణం పోక గిలగిల తన్నుకునే మొండెం వంటి మొండి ప్రేమ పడువుకత్తియ మోజుల గాజుల సడిలో సుఖరోగాల చీమునెత్తుటి చిత్తడిలో నాచులాగ, పాచిలాగ పెరుగుతున్నది శాస్త్రక్రియకు లొంగని రాచపుండై ఎదుగుచున్నది." - ఆచార్య ఆదేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.