చలనములేని
గుడిలో ఉన్న శివలింగం మాట్లాడదు ! ఎందుకు ఈ జలప్రళయము జరిగిందో తెలియదు? తెలియని వయసులో ఏదో తెలియని తపన మొదలైంది! ఏదో చెయ్యాలని... ఏదో తెలుసుకోవాలనే తపన మొదలైంది! శవాలుగా మార్చేసిన శివయ్య మీద శివతాండవం మొదలైనది! మా నాన్న ఒక చీపురుకట్ట చేతికిచ్చి గుడిని శుభ్రం చేయమని మొట్టమొదటి పనిగా అప్పగించారు! శుభ్రం చేయవలసినది గుడిని కాదని గుడిలో ఉన్న లింగమూర్తిని అని సంకల్పించాను! దైవంగా చెప్పుకుంటున్న.... పూజలందుకుంటున్న... పుష్టిగా నైవేద్యాలు తింటున్న... శివలింగ మూర్తిని ప్రశ్నించాలని నాలో నేను ఎదురు తిరిగాను! ఏ పాపం చేశారని ఇంతమందిని బాధ పెట్టినాడు? సృష్టించడం ఎందుకు? నాశనం చేయడం ఎందుకు? మమ్మల్ని సృష్టించమని అడిగామా ? నన్ను సృష్టించమని అడిగానా ? నన్ను బాధ పెట్టమని చెప్పామా? జననాలు మరణాలు ఇవ్వమని అడిగానా? నాశనం చేసే కాడికి మమ్మల్ని ఎందుకు సృష్టించావు? నీకు కళ్యాణ మహోత్సవా లు . . . మాకు బాధలు నరకయాతనలు . . . నా నా చంకలు నాకి మేము కష్టపడి సంపాదించిన వాటిని నేనే ప్రసాదించాను కదా... నాకు ఇవ్వమని అడగటం నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అడుక్కునే వాడిదగ్గర గీరుకునేవాడివి నువ్వు... మనస్సులేని రాయి నువ్వు . బండరాతివి నువ్వు... అందుకే నిన్ను శిలగా తయారుచేసి శిలువ గా బంధించి శిలాఫలక సమాధులు చేసినారు కదా! నేను అడిగిన వాటికి సమాధానం చెప్పలేని మౌన బ్రహ్మంగా ఉన్నావు! ఏమీ తెలియనట్లుగా ఏమీ జరగనట్లుగా ఉండటానికి మౌన ముద్రలో ఉండి ఎవరిని ఉద్ధరించాలి ! ఉద్ధరణ చెయ్య లేని వాడికి. . . లేనివాడికి.. గుడిలో ఎందుకు పూజలు? ఎందుకు ప్రసాదాలు? ఎందుకు నువ్వు లేని కాడికి మమ్మల్ని కాడికి పంపించే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? అసలు నన్ను సృష్టించింది ఎవరు ? ఎందుకు సృష్టి? సృష్టి నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఏమయ్యా! శివయ్య ! నాకన్నా ఎన్నో కోట్ల మందిని సృష్టించావు! వారికి నవరసాలు... నవ భక్తులు... నవ సిద్ధులు... నవమాసాలు ఇచ్చి లాలించి పాలించి చేసినావు కదా! మళ్ళీ ఏదో కొరతగా నన్ను ఎందుకు సృష్టించావు? ఇంతకుముందు చేసిన పని నేను చేసినదే కదా! చేసిన పనిని ఎన్నాళ్ళు చేస్తావు! చూస్తావు! ఆనంద పడతావు! మేము బాధలో ఉంటే ఆనందపడతావు! మేము సుఖాల్లో ఉంటే బాధ పడతావు! బాధల్లో గుర్తుకు వచ్చేలాగా చేసుకుంటావు! ఆనందంలో మరిచిపోయేలా చేస్తావు! అసలు నీవు చూసిన నాటకం ఎన్ని సార్లు చూస్తావు! దేవయ్య ...జంగమయ్య... నీకు విసుగు అనిపించదా? విరక్తి కలగడం లేదా? అయినా నా పిచ్చి గాని.......
అధ్యాయం 1 నా ఏడుపే నా తొలి సాధన - గురువుఅది 1977వ సంవత్సరంలో... ఒకసారి దివిసీమ ఉప్పెన వచ్చినపుడు నేను పుట్టలేదు... మళ్ళీ రెండవసారి వచ్చినపుడు నాకు 12 సం||రాల వయస్సులో అనగా అది 1990వ సంవత్సరంలో మే నెలలో 4-10 తేదిలలో... మళ్ళీ దివిసీమ తుఫాను భీభత్స రోజులు ... చీకటి రోజులు... అన్నమును పండించే అన్నదాతలు అన్నం కోసం పరితపించే భయంకర రోజులు... బయటకి వెళ్లిన వారు కాడికి కి వెళ్తున్న రోజులు... అన్నం కోసం, పాడిపంటలు, పశువులు కోసం పరితపించే లాగా మారిన రోజులు... ఇలా 7 రోజులు 7 యుగాలుగా గడిపిన రోజులు ... నాన్న పని చేసిన శివాలయంలో అన్నదాతల అన్నం కోసం ప్రయత్నాలు ఒక పక్క... నా అనే వాళ్ళు పోతున్నారని బాధ మరోపక్క ... మరోప్రక్క ఆస్తులు పోతున్నాయని... జీవన ఉపాధి మార్గాలు మూసుకుని పోతున్నాయని... బతుకులు గల్లంతవుతుందని ఆర్తనాదాలు... ఇలాంటి ఆవేదనల ఆర్తనాదాలు మధ్య నాకు శివాలయంలో 12 సంవత్సరాల వయస్సులో చిన్న పూజారిగా ప్రవేశ మార్గం ఏర్పడింది! చలనములేని గుడిలో ఉన్న శివలింగం మాట్లాడదు ! ఎందుకు ఈ జలప్రళయము జరిగిందో తెలియదు? తెలియని వయసులో ఏదో తెలియని తపన మొదలైంది! ఏదో చెయ్యాలని... ఏదో తెలుసుకోవాలనే తపన మొదలైంది! శవాలుగా మార్చేసిన శివయ్య మీద శివతాండవం మొదలైనది! మా నాన్న ఒక చీపురుకట్ట చేతికిచ్చి గుడిని శుభ్రం చేయమని మొట్టమొదటి పనిగా అప్పగించారు! శుభ్రం చేయవలసినది గుడిని కాదని గుడిలో ఉన్న లింగమూర్తిని అని సంకల్పించాను! దైవంగా చెప్పుకుంటున్న.... పూజలందుకుంటున్న... పుష్టిగా నైవేద్యాలు తింటున్న... శివలింగ మూర్తిని ప్రశ్నించాలని నాలో నేను ఎదురు తిరిగాను! ఏ పాపం చేశారని ఇంతమందిని బాధ పెట్టినాడు? సృష్టించడం ఎందుకు? నాశనం చేయడం ఎందుకు? మమ్మల్ని సృష్టించమని అడిగామా ? నన్ను సృష్టించమని అడిగానా ? నన్ను బాధ పెట్టమని చెప్పామా? జననాలు మరణాలు ఇవ్వమని అడిగానా? నాశనం చేసే కాడికి మమ్మల్ని ఎందుకు సృష్టించావు? నీకు కళ్యాణ మహోత్సవా లు . . . మాకు బాధలు నరకయాతనలు . . . నా నా చంకలు నాకి మేము కష్టపడి సంపాదించిన వాటిని నేనే ప్రసాదించాను కదా... నాకు ఇవ్వమని అడగటం నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అడుక్కునే వాడిదగ్గర గీరుకునేవాడివి నువ్వు... మనస్సులేని రాయి నువ్వు . బండరాతివి నువ్వు... అందుకే నిన్ను శిలగా తయారుచేసి శిలువ గా బంధించి శిలాఫలక సమాధులు చేసినారు కదా! నేను అడిగిన వాటికి సమాధానం చెప్పలేని మౌన బ్రహ్మంగా ఉన్నావు! ఏమీ తెలియనట్లుగా ఏమీ జరగనట్లుగా ఉండటానికి మౌన ముద్రలో ఉండి ఎవరిని ఉద్ధరించాలి ! ఉద్ధరణ చెయ్య లేని వాడికి. . . లేనివాడికి.. గుడిలో ఎందుకు పూజలు? ఎందుకు ప్రసాదాలు? ఎందుకు నువ్వు లేని కాడికి మమ్మల్ని కాడికి పంపించే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? అసలు నన్ను సృష్టించింది ఎవరు ? ఎందుకు సృష్టి? సృష్టి నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఏమయ్యా! శివయ్య ! నాకన్నా ఎన్నో కోట్ల మందిని సృష్టించావు! వారికి నవరసాలు... నవ భక్తులు... నవ సిద్ధులు... నవమాసాలు ఇచ్చి లాలించి పాలించి చేసినావు కదా! మళ్ళీ ఏదో కొరతగా నన్ను ఎందుకు సృష్టించావు? ఇంతకుముందు చేసిన పని నేను చేసినదే కదా! చేసిన పనిని ఎన్నాళ్ళు చేస్తావు! చూస్తావు! ఆనంద పడతావు! మేము బాధలో ఉంటే ఆనందపడతావు! మేము సుఖాల్లో ఉంటే బాధ పడతావు! బాధల్లో గుర్తుకు వచ్చేలాగా చేసుకుంటావు! ఆనందంలో మరిచిపోయేలా చేస్తావు! అసలు నీవు చూసిన నాటకం ఎన్ని సార్లు చూస్తావు! దేవయ్య ...జంగమయ్య... నీకు విసుగు అనిపించదా? విరక్తి కలగడం లేదా? అయినా నా పిచ్చి గాని.......© 2017,www.logili.com All Rights Reserved.