కపాల దుర్గం
కుంతల నగరం నడిబొడ్డున యమకింకరుడిలా వున్న ఓ రాజభటుడు దండోరా వేస్తున్నాడు.
నగర ప్రజలంతా ఎక్కడిపనులు అక్కడ వదిలేసి ఆతృతగా అక్కడికి వచ్చేశారు. కాలాశ్వం మీద నిలుచున్న మరో సైనికుడు రాజశాసనాన్ని బిగ్గరగా చదువుతున్నాడు. "ఇందుమూలముగా యావన్మంది ప్రజానీకానికి మన ప్రభువులైన ధర్మసేనులవారు తెలియజేయునది ఏమనగా 'మన రాజ్యంలో చాలా రోజులుగా యవ్వనంలో వున్న కన్యలు - రోజుకో కన్య చొప్పున ప్రతీ రాత్రి చిత్ర విచిత్రంగా అదృశ్యమవుతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. కానీ కన్యలు ఎందుకు అదృశ్యమవుతున్నారో, వాళ్ళని మాయం చేసే శక్తి ఏమిటో యింతవరకూ అంతుపట్టలేదు. కన్యకామణుల అదృశ్యానికి కారణమూ తెలియరాలేదు. కనుక ఈ రహస్యాన్ని శోధించి, కన్యకామణుల్ని క్షేమంగా తీసుకొచ్చిన ధీరునకు మన రాజావారు ధర్మసేన ప్రభువులు అర్ధరాజ్యం యివ్వటంతోపాటు తమ పుత్రికారత్నం యువరాణి కాంచనమాలను ఇచ్చి వివాహం చేయ నిశ్చయించినారు. కావున కండబలం, గుండెధైర్యం వున్న ఆసక్తిగల యువకులు ముందుకు రావలసిందహో హో...'
రాజశాసనం వినేసరికి అక్కడున్న యువకులందరికీ అపూర్వ అందాలరాశి కాంచనమాల జ్ఞాపకం వచ్చింది. కన్యకామణుల్ని వెదికి తీసుకు వచ్చినట్టు, పూలమాల సత్కారాలతో రాజుగారు ఘనసన్మానం చేసినట్టు యువరాణి కాంచనమాలను పెళ్ళాడినట్టు ఊహల్లోకి వెళ్ళిపోయిన యువకులంతా ఒక అడుగు ముందుకు వేయబోయి అదిరిపడి ఆగిపోయారు.
కన్యల్ని వెదకటానికి అప్పటివరకు వెళ్ళిన అనేకమంది యువకుల జాడలేదు! వాళ్ళు ఏమైపోయారో ఎవరికీ తెలీదు!
ముందు అర్దరాజ్యాన్ని మాత్రమే ప్రకటించిన ధర్మసేనుడు ప్రజాక్షేమం కోసం యువరాణిని కూడా బహుమతిగా ప్రకటించారు.
అర్ధరాజ్యం కోసం, యువరాణి అందంకోసం సాహసం చేసి అంతులేకుండా పోయే కంటే - బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చనే ఆలోచనతో హడలిపోతూ వెనక్కి పారిపోయారా యువకులు.................
కపాల దుర్గం కుంతల నగరం నడిబొడ్డున యమకింకరుడిలా వున్న ఓ రాజభటుడు దండోరా వేస్తున్నాడు. నగర ప్రజలంతా ఎక్కడిపనులు అక్కడ వదిలేసి ఆతృతగా అక్కడికి వచ్చేశారు. కాలాశ్వం మీద నిలుచున్న మరో సైనికుడు రాజశాసనాన్ని బిగ్గరగా చదువుతున్నాడు. "ఇందుమూలముగా యావన్మంది ప్రజానీకానికి మన ప్రభువులైన ధర్మసేనులవారు తెలియజేయునది ఏమనగా 'మన రాజ్యంలో చాలా రోజులుగా యవ్వనంలో వున్న కన్యలు - రోజుకో కన్య చొప్పున ప్రతీ రాత్రి చిత్ర విచిత్రంగా అదృశ్యమవుతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. కానీ కన్యలు ఎందుకు అదృశ్యమవుతున్నారో, వాళ్ళని మాయం చేసే శక్తి ఏమిటో యింతవరకూ అంతుపట్టలేదు. కన్యకామణుల అదృశ్యానికి కారణమూ తెలియరాలేదు. కనుక ఈ రహస్యాన్ని శోధించి, కన్యకామణుల్ని క్షేమంగా తీసుకొచ్చిన ధీరునకు మన రాజావారు ధర్మసేన ప్రభువులు అర్ధరాజ్యం యివ్వటంతోపాటు తమ పుత్రికారత్నం యువరాణి కాంచనమాలను ఇచ్చి వివాహం చేయ నిశ్చయించినారు. కావున కండబలం, గుండెధైర్యం వున్న ఆసక్తిగల యువకులు ముందుకు రావలసిందహో హో...' రాజశాసనం వినేసరికి అక్కడున్న యువకులందరికీ అపూర్వ అందాలరాశి కాంచనమాల జ్ఞాపకం వచ్చింది. కన్యకామణుల్ని వెదికి తీసుకు వచ్చినట్టు, పూలమాల సత్కారాలతో రాజుగారు ఘనసన్మానం చేసినట్టు యువరాణి కాంచనమాలను పెళ్ళాడినట్టు ఊహల్లోకి వెళ్ళిపోయిన యువకులంతా ఒక అడుగు ముందుకు వేయబోయి అదిరిపడి ఆగిపోయారు. కన్యల్ని వెదకటానికి అప్పటివరకు వెళ్ళిన అనేకమంది యువకుల జాడలేదు! వాళ్ళు ఏమైపోయారో ఎవరికీ తెలీదు! ముందు అర్దరాజ్యాన్ని మాత్రమే ప్రకటించిన ధర్మసేనుడు ప్రజాక్షేమం కోసం యువరాణిని కూడా బహుమతిగా ప్రకటించారు. అర్ధరాజ్యం కోసం, యువరాణి అందంకోసం సాహసం చేసి అంతులేకుండా పోయే కంటే - బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చనే ఆలోచనతో హడలిపోతూ వెనక్కి పారిపోయారా యువకులు.................© 2017,www.logili.com All Rights Reserved.