ఉడికిన ఉప్పడి బియ్యపు అన్నాన్ని...
చిల్లుల జల్లిమూకిడితో అమ్మ వారుస్తుంటే...
మా గుడిసె చిల్లుల నుండి కారే
వర్షపు ధారలతో పోటీగా... -
గంజిధారలు కురిపించేది మా బువ్వకుండ..
పెద్ద పండక్కి పరమాన్నం వండినా..
పెద్ద ఖర్మకి చప్పిడి కూడొండినా.. |
నిస్వార్థంగా తనపని చేసేది మా బువ్వకుండ...
ఖర్మకాలి చేయిజారి తన బ్రతుకు బద్దలైనా..
ఇంటి వాకిట్లో నిలిచిన మురుగు నీటిని
తోడే తోడయ్యేది.
మట్టుపెంకులో మట్టి నింపి అమ్మ నాటిన
గుత్తి గులాబీ మొక్కకు నెలవై...
పరిమళపూరిత పూవై పలకరించేది...
మా బువ్వకుండ.. మా వెండికొండ..
మిరప మహేష్
ఉడికిన ఉప్పడి బియ్యపు అన్నాన్ని... చిల్లుల జల్లిమూకిడితో అమ్మ వారుస్తుంటే...మా గుడిసె చిల్లుల నుండి కారే వర్షపు ధారలతో పోటీగా... -గంజిధారలు కురిపించేది మా బువ్వకుండ.. పెద్ద పండక్కి పరమాన్నం వండినా.. పెద్ద ఖర్మకి చప్పిడి కూడొండినా.. | నిస్వార్థంగా తనపని చేసేది మా బువ్వకుండ...ఖర్మకాలి చేయిజారి తన బ్రతుకు బద్దలైనా..ఇంటి వాకిట్లో నిలిచిన మురుగు నీటిని తోడే తోడయ్యేది. మట్టుపెంకులో మట్టి నింపి అమ్మ నాటిన గుత్తి గులాబీ మొక్కకు నెలవై...పరిమళపూరిత పూవై పలకరించేది... మా బువ్వకుండ.. మా వెండికొండ.. మిరప మహేష్© 2017,www.logili.com All Rights Reserved.