సాయంసమయపు మంచు
ఆకులపై పరుచుకుంటోంది
ఎవరైనా వెళ్ళి చూపండి
అతన్ని నేను వినగలుగుతున్నాను.
ఉన్న పాటుగా
కదంబ వృక్షం నుంచి
వెలువడిన ధ్వని
వీనులవిందు చేస్తోంది
కవితాత్మకమై
జీవన రహస్యాన్ని
అత్యంత మధురంగా వినిపిస్తూ
ఉద్వేగాన్ని ఉసిగొల్పుతూ
ఆశ్చర్యానందాలకు పురిగొల్పుతూ
ఆ కుదుపుని ఎలా వర్ణించడం
ఆ వేణు నాదం
నాలో మ్రోగుతూనే ఉంది
ప్రాణం తీస్తూ, ప్రాణం పోస్తూ
ఆ యువతి ఎవరు
మిత్రమా, ఎవరా కన్యక
తన చక్కని దేహంతో
నదిని దహింప చేస్తోంది
ఆమె పైయెద పైని స్వర్ణాభరణాలు
పర్వత మంచు పైన చంద్రుని కిరణాల్లా
ప్రకాశిస్తున్నాయి.................
సాయంసమయపు మంచు ఆకులపై పరుచుకుంటోంది ఎవరైనా వెళ్ళి చూపండి అతన్ని నేను వినగలుగుతున్నాను. ఉన్న పాటుగా కదంబ వృక్షం నుంచి వెలువడిన ధ్వని వీనులవిందు చేస్తోంది కవితాత్మకమై జీవన రహస్యాన్ని అత్యంత మధురంగా వినిపిస్తూ ఉద్వేగాన్ని ఉసిగొల్పుతూ ఆశ్చర్యానందాలకు పురిగొల్పుతూ ఆ కుదుపుని ఎలా వర్ణించడం ఆ వేణు నాదం నాలో మ్రోగుతూనే ఉంది ప్రాణం తీస్తూ, ప్రాణం పోస్తూ ఆ యువతి ఎవరు మిత్రమా, ఎవరా కన్యక తన చక్కని దేహంతో నదిని దహింప చేస్తోంది ఆమె పైయెద పైని స్వర్ణాభరణాలు పర్వత మంచు పైన చంద్రుని కిరణాల్లా ప్రకాశిస్తున్నాయి.................© 2017,www.logili.com All Rights Reserved.