నిర్మాణ రీత్యా తెలుగు వచన కవిత్వంలో మూడు ధోరణులున్నాయి. కథనాత్మక కవిత, వర్ణనాత్మక కవిత, ప్రయోగాత్మక కవిత. ఈ మూడు ధోరణులు నిర్మాణ దృష్టికి సంబంధించినవే. నాగరాజు రామస్వామి కవిత్వం "గూటికి చేరిన పాట" కూడా ఈ సంవిధానాలకు అతీతం కాదు. యూంగ్ "సాహిత్యంలో సహీత్యత్వమూ, మనస్తత్వమూ రెండూ ఉంటా"యన్నాడు. రామస్వామి గారి కవిత్వానికి ఈ వాక్యం మినహాయింపు కాదు. ఇంకా స్పష్టంగా చూస్తే కవిత్వంలో మానసిక ప్రతిఫలనాలే ఎక్కువ. వస్తువు, శైలి, భావన, చిత్రణ, కవితా శక్తి ఈ కవిత్వంలో ఉన్నాయి. తనదైన ముద్ర కనిపిస్తుంది. పద్యాలను ఛందోనియమాలతో అల్లగల శక్తి, ఆంగ్ల సాహిత్యాలను అనువదించగల ప్రజ్ఞ రామస్వామిగారిలో పుష్కలంగా ఉన్నాయి.
- ఎం నారాయణశర్మ
నిర్మాణ రీత్యా తెలుగు వచన కవిత్వంలో మూడు ధోరణులున్నాయి. కథనాత్మక కవిత, వర్ణనాత్మక కవిత, ప్రయోగాత్మక కవిత. ఈ మూడు ధోరణులు నిర్మాణ దృష్టికి సంబంధించినవే. నాగరాజు రామస్వామి కవిత్వం "గూటికి చేరిన పాట" కూడా ఈ సంవిధానాలకు అతీతం కాదు. యూంగ్ "సాహిత్యంలో సహీత్యత్వమూ, మనస్తత్వమూ రెండూ ఉంటా"యన్నాడు. రామస్వామి గారి కవిత్వానికి ఈ వాక్యం మినహాయింపు కాదు. ఇంకా స్పష్టంగా చూస్తే కవిత్వంలో మానసిక ప్రతిఫలనాలే ఎక్కువ. వస్తువు, శైలి, భావన, చిత్రణ, కవితా శక్తి ఈ కవిత్వంలో ఉన్నాయి. తనదైన ముద్ర కనిపిస్తుంది. పద్యాలను ఛందోనియమాలతో అల్లగల శక్తి, ఆంగ్ల సాహిత్యాలను అనువదించగల ప్రజ్ఞ రామస్వామిగారిలో పుష్కలంగా ఉన్నాయి. - ఎం నారాయణశర్మ© 2017,www.logili.com All Rights Reserved.