మానవ సమాజంలో యుగయుగాన దీర్ఘకాలానంతరం ఐతిహాసిక కావ్యాలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. అవి తత్తద్యుగీన తత్త్వాన్ని ప్రదర్శించేవి. ఇతిహాసం యుగీనవాణి, పూర్వకాలంలో వచ్చిన ప్రతి ఇతిహాసానికి ఒక అనుబంధ కావ్యం ఉండేది - ప్రాచ్య దేశాల్లో గానీ పాశ్చాత్యదేశాలలో గానీ. వాల్మీకీ రచిత రామాయణానికి ఉత్తరకాండ అనుబంధ కావ్యము. అట్లాగే వ్యాస మహాభారతానికి అనుబంధకావ్యం హరివంశం. ఇదే విధంగా ప్రాచీనకాలంలో గ్రీసులో వచ్చిన జగద్విదితమైన హోమర్ విరచిత ఇలియడ్ అనే ఇతిహాసానికి అడిస్సీ అనుబంధ కావ్యం. ఇతిహాస కావ్యరచనా ప్రక్రియానుసారంగా ఆధునిక మహాభారతానికి అనుబంధకావ్యంగా ఈ జనవంశం వచ్చింది.

© 2017,www.logili.com All Rights Reserved.