కథ వింటావా ఈ కాలంలోనూ
కథ వినే మనసుందా నీకు!
హా వింటాను నువ్వెప్పుడూ చెప్పే
ఆ కథే మరల మరలా!
ఇలా అని నన్ను వెక్కిరిస్తున్నావా
నాకు తెలిసింది అదే కదా!
అందుకే ఆ కథ కాని కథే చెప్పు
ఇలా నా కనులు మూతపడక మునుపే!
నిజమే విను మరి
నీకు తెలిసిన ఆ చిత్రమే కదా అలా!
ఈ వెన్నెల దీపం కింద ఈ వెదురు పొదలో
పదే పదే ఒక పదాల గూడు కట్టుకొని!
ఇన్ని కలల తునకలను ఏరుకుంటూ
నీ కనురెప్పలపై వాలిపోతున్న తూనీగలా!
ఈ కథ నీకూ నాకూ సుపరిచితమే కదా
తెలవారి ఈ గాయాలను స్పృశిస్తూ
పొద్దు పొడవనీ!!
కథ వింటావా ఈ కాలంలోనూ కథ వినే మనసుందా నీకు! హా వింటాను నువ్వెప్పుడూ చెప్పే ఆ కథే మరల మరలా! ఇలా అని నన్ను వెక్కిరిస్తున్నావా నాకు తెలిసింది అదే కదా! అందుకే ఆ కథ కాని కథే చెప్పు ఇలా నా కనులు మూతపడక మునుపే! నిజమే విను మరి నీకు తెలిసిన ఆ చిత్రమే కదా అలా! ఈ వెన్నెల దీపం కింద ఈ వెదురు పొదలో పదే పదే ఒక పదాల గూడు కట్టుకొని! ఇన్ని కలల తునకలను ఏరుకుంటూ నీ కనురెప్పలపై వాలిపోతున్న తూనీగలా! ఈ కథ నీకూ నాకూ సుపరిచితమే కదా తెలవారి ఈ గాయాలను స్పృశిస్తూ పొద్దు పొడవనీ!!© 2017,www.logili.com All Rights Reserved.