ఈ పన్నెండు కథానికల రచయిత, 21 అక్షరాల 'చిరంజీవివర్మ అనే వత్సవాయి చిట్టి వెంకటపతిరాజు' మంచి కథానిక లక్షణాలు క్షుణ్ణంగ తెలిసిన బహు చతురుడు. ఈ కథానికలలో ఎత్తుగడ, కథనరీతి, పాత్రల సంభాషణల్లో, కథనంలో కూర్చిన మాండలికం, యాస, హాస్యం, వ్యంగ్యం, కథానికల ముగింపులో ఈ రచయిత నేర్పు ప్రశంసనీయం. ఈ కథానికలు లాక్షణికులని సైతం ఒప్పిస్తాయి. ఈ రచయిత చిరంజీవి.
- భమిడిపాటి జగన్నాథరావు.
మర్యాదంటే నువ్వు కోరుకునేది కాదు. నీకెలా ఇస్తే అదే. పెద్ద పల్లెటూళ్ల వంటి చిన్న పట్టణాల్లో వేలందొరల లోగిళ్లు లంకలు. మైసూరెడ్ల బళ్లకీ, గుర్రబ్బళ్లకీ సరదాల లోకానికి దూరంగా, కాలంతో నిమిత్తం లేకుండా యవ్వనంలోంచి వృద్ధాప్యంలోకి ఒక గదిలోంచి మరొక గదిలోకి వెళ్లినట్లు వంటలు చేస్తూనో, చేయిస్తూనో తమని మర్చిపోయిన మహిళలు....
- చిరంజీవి వర్మ