చల్లని ఈ రేయిలో నా మది నీకై వెతికేను కృష్ణా!
కనులు మూసి చూడ నువ్వెక్కడెక్కడనుంటివో!
లేత వెన్నెట్లో మ్రోగెను కృష్ణుని వేణు గానాలు
చల్లని పిల్లగాలులకి తలలూచెనచటి తరులు
ఆ నీడన ఆదమరిచి సేదతీరేను ఆలమందలు
పురివిప్పి నాట్యమాడే అటుగా వచ్చిన నెమళ్లు
ఆకలితో వడివడిగా ఆవులు చేరెను దూడలు
ఇక ఇంటికి పోదామనె సొలసిన స్నేహితులు
యమున ఒడ్డున ఇదిగో వచ్చునని వేయి కనులు
చేసుకుని ఎదురు తెన్నులు చూసెను గోపికలు
చల్లని ఈ రేయిలో నా మది నీకై వెతికేను కృష్ణా!
కనులు మూసి చూడ నువ్వెక్కడెక్కడనుంటివో!!.................
© 2017,www.logili.com All Rights Reserved.