రాజకీయ నేతలు వివిధ సందర్భాలలో చేసే వ్యాఖ్యలను విన్నప్పుడు, వాటికీ విరుగుడుగానో, జోడింపుగానో ప్రతివ్యాఖ్యలు చేయాలని ఆయనకు అనిపించింది. ఒక అన్యాయపు మాట అట్లా ఎదురులేకుండా పోవలసిందేనా అని మధనపడి, దాన్ని తన మాటకు మాటతో సమతుల్యం చేసే ప్రయత్నం చేశాడు. మంచి పాత్రికేయుడికి సహజంగా కలిగే స్పందన అది. ఆంధ్రజ్యోతి పత్రికలో శేఖర్ రెడ్డి నిర్వహించిన ఆ శీర్షిక - మొత్తం రాజకీయ ప్రపంచంతో చేసిన ఒక సంభాషణ.
- కె.శ్రీనివాస్
ప్రతి సందర్భంలోనూ, ప్రతి పోరాటంలోనూ, ప్రతి దాడికీ ఎదురుదాడి చెయ్యడంలోనూ, చేతులు అడ్డంపెట్టి దోసలిమూసి తెలంగాణ వాదం దీపం కాపాడడంలోనూ శేఖర్ రెడ్డి పరిణితి కనిపిస్తుంది. వారం వారం అవతలి వాళ్లు వేసే ప్రశ్నలు, అతి పురాతనమైనవే అయినా కొత్త దాడి కోసం వాడే మాటలు అన్నింటినీ తిప్పికొట్టి పక్కా తెలంగాణవాదిగా కలం ఎదురొడ్డి నిలబడినవాడు శేఖర్ రెడ్డి. అప్పటి కాలమ్ స్వరూప స్వభావానికి 'కట్టా మీఠా' గా మారిన తర్వాతకూ ఏ మాత్రం పొంతనలేదు. ఒంటిచేతితో ఆయన ఒక రాతల ఉద్యమమే చేశాడు.
- అల్లం నారాయణ
రాజకీయ నేతలు వివిధ సందర్భాలలో చేసే వ్యాఖ్యలను విన్నప్పుడు, వాటికీ విరుగుడుగానో, జోడింపుగానో ప్రతివ్యాఖ్యలు చేయాలని ఆయనకు అనిపించింది. ఒక అన్యాయపు మాట అట్లా ఎదురులేకుండా పోవలసిందేనా అని మధనపడి, దాన్ని తన మాటకు మాటతో సమతుల్యం చేసే ప్రయత్నం చేశాడు. మంచి పాత్రికేయుడికి సహజంగా కలిగే స్పందన అది. ఆంధ్రజ్యోతి పత్రికలో శేఖర్ రెడ్డి నిర్వహించిన ఆ శీర్షిక - మొత్తం రాజకీయ ప్రపంచంతో చేసిన ఒక సంభాషణ. - కె.శ్రీనివాస్ ప్రతి సందర్భంలోనూ, ప్రతి పోరాటంలోనూ, ప్రతి దాడికీ ఎదురుదాడి చెయ్యడంలోనూ, చేతులు అడ్డంపెట్టి దోసలిమూసి తెలంగాణ వాదం దీపం కాపాడడంలోనూ శేఖర్ రెడ్డి పరిణితి కనిపిస్తుంది. వారం వారం అవతలి వాళ్లు వేసే ప్రశ్నలు, అతి పురాతనమైనవే అయినా కొత్త దాడి కోసం వాడే మాటలు అన్నింటినీ తిప్పికొట్టి పక్కా తెలంగాణవాదిగా కలం ఎదురొడ్డి నిలబడినవాడు శేఖర్ రెడ్డి. అప్పటి కాలమ్ స్వరూప స్వభావానికి 'కట్టా మీఠా' గా మారిన తర్వాతకూ ఏ మాత్రం పొంతనలేదు. ఒంటిచేతితో ఆయన ఒక రాతల ఉద్యమమే చేశాడు. - అల్లం నారాయణ
© 2017,www.logili.com All Rights Reserved.