పరిశీలన అనేది గొప్పవరం. కవికి అదే గొప్ప కళ. కవిత్వం రాయటమే కాదు, దానికి ముందు కవికి విశాల హృదయముండాలి. ఒక సంఘటన, ఒక సన్నివేశం, మరేదైనా కావచ్చు. కానీ కవి చూసేతీరు వేరు. కవి చూపులోనే అనేక కోణాలుంటాయి. మరికొన్ని ప్రత్యేకతలుంటాయి. అవే కవిత్వంగా మరలిపోతుంటాయి. అలాంటి కవిత్వమే చదవటానికి, పదిలపరచుకొనేందుకు అర్హత సంపాదించుకుంటుంది. ఈ ఆధునిక సాహిత్యం కూడా ప్రజల మన్నన పొందటానికి కారణం ఇదే. అలాంటి వరుసలో నిలబడే కవిత్వమే మార్టూరి శ్రీరాం ప్రసాద్ గారి ఈ కవితా సంపుటి నిండా కనిపిస్తుంది. గుండెకు సూటిగా తగిలేలా, ఆకర్షణీయంగా, స్పష్టంగా కవిత్వీకరించటం మార్టూరి గారికి బాగా అబ్బిన విద్య. ప్రతి పదం గుండెల్లో మలుపులు తిప్పుతూ, చదివిస్తుంది. ప్రతి కవిత ఒక అనుభవాన్ని ప్రస్ఫుట పరుస్తుంది. ఆ అనుభవాలే జీవితానికి అడుగులను అందిస్తుంది.
పరిశీలన అనేది గొప్పవరం. కవికి అదే గొప్ప కళ. కవిత్వం రాయటమే కాదు, దానికి ముందు కవికి విశాల హృదయముండాలి. ఒక సంఘటన, ఒక సన్నివేశం, మరేదైనా కావచ్చు. కానీ కవి చూసేతీరు వేరు. కవి చూపులోనే అనేక కోణాలుంటాయి. మరికొన్ని ప్రత్యేకతలుంటాయి. అవే కవిత్వంగా మరలిపోతుంటాయి. అలాంటి కవిత్వమే చదవటానికి, పదిలపరచుకొనేందుకు అర్హత సంపాదించుకుంటుంది. ఈ ఆధునిక సాహిత్యం కూడా ప్రజల మన్నన పొందటానికి కారణం ఇదే. అలాంటి వరుసలో నిలబడే కవిత్వమే మార్టూరి శ్రీరాం ప్రసాద్ గారి ఈ కవితా సంపుటి నిండా కనిపిస్తుంది. గుండెకు సూటిగా తగిలేలా, ఆకర్షణీయంగా, స్పష్టంగా కవిత్వీకరించటం మార్టూరి గారికి బాగా అబ్బిన విద్య. ప్రతి పదం గుండెల్లో మలుపులు తిప్పుతూ, చదివిస్తుంది. ప్రతి కవిత ఒక అనుభవాన్ని ప్రస్ఫుట పరుస్తుంది. ఆ అనుభవాలే జీవితానికి అడుగులను అందిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.