కంటిలోన ఎరుపురంగు చిట్లినట్లు ఉందేమిటి
నిదురలేని రాత్రులలో మునిగినట్లు ఉందేమిటి.
రెప్పలలో వెన్నెలలే రెక్కలొచ్చి ఎగిరాయి
గ్రహణమొచ్చి నీరూపుని మింగినట్లు ఉందేమిటి.
శీతలించు వెలుగులన్ని నన్ను తాకకున్నాయి
విరహమంత ఒక్కసారి విచ్చినట్లు ఉందేమిటి.
గుండెలోని బాధలన్ని ఫక్కుమంటు నవ్వాయి
తడియారని గాయమేదో రేగినట్లు ఉందేమిటి.
చెక్కిళ్ళను ఎడారులే పలకరించి పోతున్నవి
కనులలోని చెలమలన్ని ఎండినట్లు ఉందేమిటి.
తిరిగిరాని చెలికోసం నేటివరకు వెదికాను
వియోగమే తన దారిని మూసినట్లు ఉందేమిటి.
జీవితమే చీకటిలో కూరుకుంది "నెలరాజా"
పున్నములను అమావాస్య మింగినట్లు ఉందేమిటి.
కంటిలోన ఎరుపురంగు చిట్లినట్లు ఉందేమిటి నిదురలేని రాత్రులలో మునిగినట్లు ఉందేమిటి. రెప్పలలో వెన్నెలలే రెక్కలొచ్చి ఎగిరాయి గ్రహణమొచ్చి నీరూపుని మింగినట్లు ఉందేమిటి. శీతలించు వెలుగులన్ని నన్ను తాకకున్నాయి విరహమంత ఒక్కసారి విచ్చినట్లు ఉందేమిటి. గుండెలోని బాధలన్ని ఫక్కుమంటు నవ్వాయి తడియారని గాయమేదో రేగినట్లు ఉందేమిటి. చెక్కిళ్ళను ఎడారులే పలకరించి పోతున్నవి కనులలోని చెలమలన్ని ఎండినట్లు ఉందేమిటి. తిరిగిరాని చెలికోసం నేటివరకు వెదికాను వియోగమే తన దారిని మూసినట్లు ఉందేమిటి. జీవితమే చీకటిలో కూరుకుంది "నెలరాజా" పున్నములను అమావాస్య మింగినట్లు ఉందేమిటి.
© 2017,www.logili.com All Rights Reserved.