రెంటాల వారిని ఎవరు ప్రశంసించినా.. నన్ను ప్రశంసించినట్లుగానే, తెలుగు గజల్ ను ఆశీర్వదించినట్లుగానే అనిపిస్తుంది. రెంటాల లాంటి గజల్ రచయిత తెలుగు గజల్ కు లభించటం మన అదృష్టం. గజల్ శ్రీనివాస్ గా గానయాత్రలో దేశాధ్యక్షులు, పీఠాధిపతులు, ప్రముఖ చలనచిత్ర కళాకారులు.. రెంటాల వారు వ్రాసిన గజల్స్ విని ఆయనను పలువిధాలా ప్రశంసించారు. ఒకానొక సందర్భంలో నేను 'నాన్న గజల్' గానం చేస్తుండగా ఆలకించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామివారు రెంటాల వారు వ్రాసిన ఆ గజల్ గురించి మాట్లాడుతూ.. 'శ్రీమాన డా రెంటాల వారు వ్రాసిన నాన్న గజల్ నన్ను కదిలించి వేసింది. వారి గజల్ ద్వారా నాన్న యొక్క విశిష్టతను గొప్పగా చాటారు. నేను తరచూ శ్రీమాన్ డా గజల్ శ్రీనివాస్ గారి దగ్గర ఆ గజల్ వింటూ ఉంటాను. డా రెంటాల వారికి మంగళా శాసనాలు' తెలిపారు.
- డా గజల్ శ్రీనివాస్
రెంటాల వారిని ఎవరు ప్రశంసించినా.. నన్ను ప్రశంసించినట్లుగానే, తెలుగు గజల్ ను ఆశీర్వదించినట్లుగానే అనిపిస్తుంది. రెంటాల లాంటి గజల్ రచయిత తెలుగు గజల్ కు లభించటం మన అదృష్టం. గజల్ శ్రీనివాస్ గా గానయాత్రలో దేశాధ్యక్షులు, పీఠాధిపతులు, ప్రముఖ చలనచిత్ర కళాకారులు.. రెంటాల వారు వ్రాసిన గజల్స్ విని ఆయనను పలువిధాలా ప్రశంసించారు. ఒకానొక సందర్భంలో నేను 'నాన్న గజల్' గానం చేస్తుండగా ఆలకించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామివారు రెంటాల వారు వ్రాసిన ఆ గజల్ గురించి మాట్లాడుతూ.. 'శ్రీమాన డా రెంటాల వారు వ్రాసిన నాన్న గజల్ నన్ను కదిలించి వేసింది. వారి గజల్ ద్వారా నాన్న యొక్క విశిష్టతను గొప్పగా చాటారు. నేను తరచూ శ్రీమాన్ డా గజల్ శ్రీనివాస్ గారి దగ్గర ఆ గజల్ వింటూ ఉంటాను. డా రెంటాల వారికి మంగళా శాసనాలు' తెలిపారు. - డా గజల్ శ్రీనివాస్© 2017,www.logili.com All Rights Reserved.