చిత్రనిద్రలోని వాస్తవిక, స్మృత్యుద్దీపనలు
సాధారణంగా కవులను ఏదో ఒక స్పృహ మొదటగా ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరణ కవిత్వంగా మారడానికి మధ్య రూపాన్ని మార్చుకుంటుంది. దానికి మానసిక ప్రతిఫలనాలు కారణం. స్పృహ వ్యక్తమవడానికి ఒకటికి మించిన మార్గాలున్నాయి. కాని ఉపరితలంలో ఏదో ఒక రూపం లేదా మార్గం ఎక్కువగా ఉపయోగంలో లేదా ప్రచారంలో ఉంటుంది. నిజానికి స్పృహకు కవిత్వంలోని వస్తువుకు మధ్య సహ సంబంధాలుంటాయి. వస్తువుకన్నా వస్తువు ముందు విషయంతో సంబంధాలెక్కువ. కవులను వస్తువు కన్నా విషయమే ఎక్కువగా ప్రేరేపిస్తుంది. విషయం సమాజంతో ముడిపడి ఉండడం వస్తువు విషయంలో మౌనంగా దాగి ఉండడం దానికి కారణం. విషయం సమాజంతో ముడిపడి ఉండడానికి ఒక కారణం ఉంది అది కాలం. సాహిత్యాన్ని స్పష్టంగా చెబుతే, సాహిత్య గమనాన్ని కాలమే సూచిస్తుందని భావించడానికి కారణం అదే. ఒక సమయాన్ని కాలం ప్రేరేపించడంవల్లనే సంస్కరణవాదం నుంచి ఇప్పుడున్న అస్తిత్వవాదాలదాకా అన్నీ వెలుగుచూసాయి. చైతన్యం అందుకు ఒక కారణం. విషయం, వస్తువు వెలుగు చూడడానికి కారణాలున్నట్టే, వ్యక్తీకరణ వెనుక కూడా అనేక ప్రతిఫలనాలుంటాయి. దానికి కాలం అది ఇచ్చే సామాజిక ప్రేరణ, భిన్న పార్శ్వాలనుండి అధ్యయనం చేయడం వలన ఏర్పడిన మానసిక భావన. అధ్యయనంలోని ప్రతిఫలనాలు ఇవన్ని మానసికంగా వ్యక్తీకరణలో ప్రతిఫలిస్తాయి. విషయం వస్తువు ఒకే కేంద్రంగా ఉన్నా వ్యక్తీకరణలో వైవిధ్యం వైరుధ్యం ఉండడానికి ఇదో కారణం.
వంశీకృష్ణను కవిగా కొత్తగా పరిచయం చేయవలసిన అవసరంలేదు. కవిగానే కాక ఇతరమైన అనేక పార్శ్వాలనుంచి సాహిత్యం, సినిమా రంగాలలో ఆయనకొక స్థానం ఉంది. బహుశః సాధారణంగా ఒక కవికి ఉండే అతిసాధారణ వ్యాపకాలకన్నా...................
చిత్రనిద్రలోని వాస్తవిక, స్మృత్యుద్దీపనలు సాధారణంగా కవులను ఏదో ఒక స్పృహ మొదటగా ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరణ కవిత్వంగా మారడానికి మధ్య రూపాన్ని మార్చుకుంటుంది. దానికి మానసిక ప్రతిఫలనాలు కారణం. స్పృహ వ్యక్తమవడానికి ఒకటికి మించిన మార్గాలున్నాయి. కాని ఉపరితలంలో ఏదో ఒక రూపం లేదా మార్గం ఎక్కువగా ఉపయోగంలో లేదా ప్రచారంలో ఉంటుంది. నిజానికి స్పృహకు కవిత్వంలోని వస్తువుకు మధ్య సహ సంబంధాలుంటాయి. వస్తువుకన్నా వస్తువు ముందు విషయంతో సంబంధాలెక్కువ. కవులను వస్తువు కన్నా విషయమే ఎక్కువగా ప్రేరేపిస్తుంది. విషయం సమాజంతో ముడిపడి ఉండడం వస్తువు విషయంలో మౌనంగా దాగి ఉండడం దానికి కారణం. విషయం సమాజంతో ముడిపడి ఉండడానికి ఒక కారణం ఉంది అది కాలం. సాహిత్యాన్ని స్పష్టంగా చెబుతే, సాహిత్య గమనాన్ని కాలమే సూచిస్తుందని భావించడానికి కారణం అదే. ఒక సమయాన్ని కాలం ప్రేరేపించడంవల్లనే సంస్కరణవాదం నుంచి ఇప్పుడున్న అస్తిత్వవాదాలదాకా అన్నీ వెలుగుచూసాయి. చైతన్యం అందుకు ఒక కారణం. విషయం, వస్తువు వెలుగు చూడడానికి కారణాలున్నట్టే, వ్యక్తీకరణ వెనుక కూడా అనేక ప్రతిఫలనాలుంటాయి. దానికి కాలం అది ఇచ్చే సామాజిక ప్రేరణ, భిన్న పార్శ్వాలనుండి అధ్యయనం చేయడం వలన ఏర్పడిన మానసిక భావన. అధ్యయనంలోని ప్రతిఫలనాలు ఇవన్ని మానసికంగా వ్యక్తీకరణలో ప్రతిఫలిస్తాయి. విషయం వస్తువు ఒకే కేంద్రంగా ఉన్నా వ్యక్తీకరణలో వైవిధ్యం వైరుధ్యం ఉండడానికి ఇదో కారణం. వంశీకృష్ణను కవిగా కొత్తగా పరిచయం చేయవలసిన అవసరంలేదు. కవిగానే కాక ఇతరమైన అనేక పార్శ్వాలనుంచి సాహిత్యం, సినిమా రంగాలలో ఆయనకొక స్థానం ఉంది. బహుశః సాధారణంగా ఒక కవికి ఉండే అతిసాధారణ వ్యాపకాలకన్నా...................© 2017,www.logili.com All Rights Reserved.