మౌనశ్రీ మల్లికలో అన్ని విశ్వదర్శనాలు ఇముడుతాయి. కవిగా అతడు పిల్లవాడు కాదు లబ్దప్రతిష్ఠుడు. తప్తస్పృహ - ఇంతగా కాలిన ఈ స్పృహ చైతన్యం కాగలిగితే. అయిన సందర్భాలు లేవని కాదు. ఇంత తప్తస్పృహ నుంచి ఇటువంటి ఒక దృక్పథం స్థిరంగా దృడంగా ఏర్పడితే ఎంతబాగుండుననిపిస్తుంది. మౌనశ్రీ లో కవి ఉన్నాడు. తాత్విక చింతన ఉన్నది. తాత్విక చింతనలేని కవిత్వం నిలవదు. అయితే ఆ తాత్విక చింతన ఉత్పత్తి సంబంధాలు - సంఘర్షణలు చూడగలిగి చిత్రించేది కాలేకపోతే మనం ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేం. అర్ధం చేసుకోకుండా మార్చలేం. తత్వశాస్త్రం మాయాజాలం కాదు. స్వేచ్ఛ కోసం మానవజాతి వికాసం కోసం చేసిన పోరాటాలు ఈ క్రమంలో వికసించిన నాగరికత చరిత్ర గురించిన అవగాహన కవికి తెలుసు. మౌనశ్రీ కి తెలియని అడవి మల్లెలపరిమళాలు కావవి.
- మౌనశ్రీ మల్లిక్