చరాచర జగత్తంతా ఎవని వల్ల నడపబడుతున్నదో, ఎవని వల్ల సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయో? అతడే బ్రహ్మము. దీన్నే ఆత్మ అనికూడా అంటారు. -
ఆ బ్రహ్మమును గురించి చెప్పే విద్యనే బ్రహ్మవిద్య అంటారు. "బ్రహ్మవిద్య చాలా కష్టమైనది. ఒక పట్టాన అర్థం కాదు. సామాన్య మానవులకు ఇది కొరుకుడు పడదు" అని ప్రజాభిప్రాయము. అందుకే ఏదైనా విషయం అర్ధం కాలేదు అంటే ఇదేమైనా బ్రహ్మవిద్యా? అర్థం కాకపోవటానికి? అంటారు. బ్రహ్మవిద్య అంత కష్టమైనది ఏమికాదు. ఆసక్తి గలవారికి అతితేలికగా అర్థమవుతుంది. కాబట్టి బ్రహ్మవిద్య అనే ఈ గ్రంథాన్ని అతిసరళమైన భాషలో, సామాన్యులకు కుడా అర్థమయ్యే రీతిలో మీకు అందిస్తున్నాను.
సృష్టి స్థితిలయాలకు కారణమైనది, ఆనందమయమైనది, సత్యము, జ్ఞానము, అనంతమైనది, జన్మ మృత్యుజరాదులు లేనిది, శాశ్వతమైనది, జగత్తులోని అన్నింటికీ ఆధారమైనది, అన్నింటికీ చైతన్యాన్నిచ్చేది ఆత్మ. అదే బ్రహ్మము. సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగత్తంతా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని బ్రహ్మము ఆక్రమించి ఉన్నది. సృష్టి తరువాత 84 లక్షల రకాల జీవరాసుల రూపంలో మళ్ళీ ఈ జగత్తంతా ఆక్రమించి ఉన్నది. అదే బ్రహ్మము. చరాచర జగత్తులోని ప్రతి వస్తువు నందు, ప్రతిజీవి యందు లోపలా బయట అంతటా ఆవరించి ఉన్నది బ్రహ్మము. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్లుగా బ్రహ్మము నాలుగు పాదాలుగా ఉంటుంది. ఇక్కడ పాదము అంటే - భాగము అని అర్థం.
అంటే చరాచర జగత్తులో బ్రహ్మము కానిది ఏదీలేదు. కంటికి కనిపించేవి, కనిపించనివి, ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, చలనమున్నవి, చలనం లేనివి అన్నీ.............
బ్రహ్మము చరాచర జగత్తంతా ఎవని వల్ల నడపబడుతున్నదో, ఎవని వల్ల సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయో? అతడే బ్రహ్మము. దీన్నే ఆత్మ అనికూడా అంటారు. - ఆ బ్రహ్మమును గురించి చెప్పే విద్యనే బ్రహ్మవిద్య అంటారు. "బ్రహ్మవిద్య చాలా కష్టమైనది. ఒక పట్టాన అర్థం కాదు. సామాన్య మానవులకు ఇది కొరుకుడు పడదు" అని ప్రజాభిప్రాయము. అందుకే ఏదైనా విషయం అర్ధం కాలేదు అంటే ఇదేమైనా బ్రహ్మవిద్యా? అర్థం కాకపోవటానికి? అంటారు. బ్రహ్మవిద్య అంత కష్టమైనది ఏమికాదు. ఆసక్తి గలవారికి అతితేలికగా అర్థమవుతుంది. కాబట్టి బ్రహ్మవిద్య అనే ఈ గ్రంథాన్ని అతిసరళమైన భాషలో, సామాన్యులకు కుడా అర్థమయ్యే రీతిలో మీకు అందిస్తున్నాను. సృష్టి స్థితిలయాలకు కారణమైనది, ఆనందమయమైనది, సత్యము, జ్ఞానము, అనంతమైనది, జన్మ మృత్యుజరాదులు లేనిది, శాశ్వతమైనది, జగత్తులోని అన్నింటికీ ఆధారమైనది, అన్నింటికీ చైతన్యాన్నిచ్చేది ఆత్మ. అదే బ్రహ్మము. సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగత్తంతా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని బ్రహ్మము ఆక్రమించి ఉన్నది. సృష్టి తరువాత 84 లక్షల రకాల జీవరాసుల రూపంలో మళ్ళీ ఈ జగత్తంతా ఆక్రమించి ఉన్నది. అదే బ్రహ్మము. చరాచర జగత్తులోని ప్రతి వస్తువు నందు, ప్రతిజీవి యందు లోపలా బయట అంతటా ఆవరించి ఉన్నది బ్రహ్మము. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్లుగా బ్రహ్మము నాలుగు పాదాలుగా ఉంటుంది. ఇక్కడ పాదము అంటే - భాగము అని అర్థం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, భూమి, ఆకాశం. ఈ రకంగా దశదిశలు బ్రహ్మమే. నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులు, పర్వతాలు, లోయలు అన్నీ బ్రహ్మమే. భూలోకంలోనే కాదు ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ బ్రహ్మమే. దేహంలో ఉండే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ప్రాణం అన్నీ బ్రహ్మమయము. అంటే చరాచర జగత్తులో బ్రహ్మము కానిది ఏదీలేదు. కంటికి కనిపించేవి, కనిపించనివి, ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, చలనమున్నవి, చలనం లేనివి అన్నీ.............© 2017,www.logili.com All Rights Reserved.