ప్రణతులు
శ్రీవిద్య అంటే మోక్ష విద్య. 'ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా' అంటోంది లలితాసహస్రం. చరమే జన్మని శ్రీవిద్యోపాసకోభవేత్. మానవుడు తన ఆఖరు జన్మలో శ్రీవిద్యోపాసకుడు అవుతాడు. అందుకే శ్రీవిద్యను ఉపాసించాలి అంటే అది అతడికి ఆఖరుజన్మ కావాలి. లేదా అతడు సాక్షాత్తు ఈశ్వరస్వరూపుడు కావాలి. మొత్తంమీద శ్రీవిద్యోపాసకులకు మరుజన్మ ఉండదు.
అటువంటి మోక్షవిద్య అయిన శ్రీవిద్యను బహుళప్రచారం చెయ్యాలనే సంకల్పంతోనే, శ్రీవిద్యమీద అనేక పుస్తకాలు వ్రాయటం, ఉపన్యాసాలు చెప్పటం కూడా జరిగింది. అయితే జనబాహుళ్యానికి ఇంకా చిన్న చిన్న అనుమానాలున్నాయి. అవి మంత్రానికి, యంత్రానికి హోమానికి సంబంధించి నవి. ఆ సందేహాలన్నీ నివృత్తి చెయ్యాలనే సంకల్పంతోనే “శ్రీవిద్యలో సందేహాలు సమాధానాలు" అనే పేరుతో ఈ పుస్తకం వ్రాయటం జరిగింది. దీన్ని చదివిన వారికి శ్రీవిద్య అంటే ఏమిటో తెలుస్తుంది. దానిమీద ఒక అవగాహన కలుగుతుంది.
ఈ పుస్తకం నాలుగు భాగాలుగా ఉంటుంది.
© 2017,www.logili.com All Rights Reserved.