హైందవ పురాణ గ్రంధాలలో చెప్పిన సమాచారం ప్రకారం చూసినట్లయితే గరుత్మంతుడు - మానవ మరియు గరుడ పక్షి రూపాల కలయికతో ఏర్పడిన రూపంలో ఉంటాడని తెలుస్తున్నది. గరుత్మంతుడికి మానవ శిరస్సు, గరుడ పక్షి రెక్కలు, గరుడ పక్షి ముక్కు, గరుడ పక్షికి ఉన్నట్లుగా కాళ్ళకు, చేతులకు వంకర తిరిగిన గోళ్ళ ఉంటాయి. పురాణాలలో గరుడ యొక్క రూపం గురించి చాలా స్పష్టంగా వివరించబడి ఉన్నది. ఆయన బంగారు రంగు దేహాన్ని కలిగి ఉంటాడని, ఎర్రటి రెక్కలను కలిగి ఉంటాడని, ఆయన శిరస్సుపై స్వర్ణ కిరీటం ఉంటుందని, ఆయన సూర్యగోళాన్ని కూడా కనపడకుండా చెయ్యగల మహా ఆకారాన్ని కలిగి ఉంటాడని చెప్పబడి ఉన్నది. గరుత్మంతుడు ఈ భూమిమీద సంచరించే అన్ని రకాల పక్షి జాతులకు ప్రభువుగా గుర్తించబడ్డాడు.
- శ్రీ ధరన్ కాండూరి