శారీరకమైన అవసరాలకి బ్రతికే ప్రాణులు ఈ భూమిమీద కోకోల్లలున్నాయి. శారీరకమైన ధర్మసంగ్రహంతో పాటు మనస్సును కూడా ఉపయోగించి జీవితాన్ని సాగించే ప్రాణి మనుష్యుడొక్కడే కదా! మనిషి చేసే పని ఆలోచన కదా! ఆ ఆలోచనని జీవితాన్ని అమృతమయం చేసుకోవడం కోసం వినియోగించుకోగలగడమే దానికి ప్రయోజనం.
అలా చేసుకోవడంతో పాటు సర్వశరీరాలలో ఉండే జీవులకి సత్తప్రదానం చేసే పరమాత్మ యొక్క సాన్నిహిత్యాన్ని సంబంధాన్ని గుర్తించడం ద్వారా దాన్ని సార్థకపరుచుకోవాలని మనకు ప్రబోధించినవారు మహర్షులు. ఆ మహర్షులమార్గంలో మానని నడిపించి జన్మకు సార్ధకతను చేకూర్చే మహనీయులు గురువులు. ఆచార్యులు. ఈ గమనంలో ఏర్పడే, స్ఖలిత్యాలను సరిదిద్ది సుఖప్రేరణకు అవసరమైన జ్ఞానోపదేశం చేస్తుంటారు ఆచార్యులు.