శ్రీ దత్తాత్రేయ మహాత్మ్యమ్ అనే పేరుతో సుమారు అయిదువేల శ్లోకాల గ్రంథం శకాబ్దం 1818 లో అంటే క్రీ. శ. 1896 లో ముద్రితమయ్యింది. అప్పటినుంచీ భారతదేశంలో అనేక కుటుంబాలవారికి ఇది పారాయణ గ్రంథమయ్యింది. దీని ముగింపులో - "ఇదం పుస్తకం బెళగాంవాఖ్యపుర్యాo సావంతోపాహ్యయేన అబాజీరామచంద్ర ఇత్యనేన స్వకీయ 'శ్రీరామతత్త్వప్రకాశాఖ్య' ముద్రణాలయే ముద్రయిత్వా ప్రకాశ్యం నీతమ్' - అని పెద్ద అక్షరాల్లో ఉంది. తాళపత్రగ్రంథాల పద్ధతిలో అడ్డంగా అచ్చోత్తించిన గ్రంథమిది. దీనిలో అక్కడక్కడా కొన్ని శ్లోకాలకు లఘుటీకకూడా ఉంది. పుటలో పైన క్రిందా ఈ టీకను సన్నటి అక్షరాల్లో ముద్రించారు.
- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం