కుజసప్తతి
జ్యోతిషసోదరులకు తెలియని విషయం కాదు; కుజదోషం వ్యవహారం ఎంత జటిలమో, ఎన్ని అపజయాలను మనకు అందిస్తున్నదో, కుజదోషానికి సంబంధించి పరిహారాలు కోకొల్లలు. కాని పరిహారాలు తప్పటం, దాంపత్యాలు భగ్నం కావటం కూడా అంతే సంఖ్యలో ఉన్నాయి. అయితే పరిహారాలు కుదిరి లేదా కుదిరినట్లనిపించి జరుగుతున్న కాపురాలు గూడా చాలానే ఉన్నాయి. ఇందువలన సిద్ధాంతుల అనుభవాలు, పేరుప్రతిష్ఠలు, హస్తవాసి, వాక్ శుద్ధి మొదలగు జ్యోతిషంతో సంబంధంలేని విషయాలకు ప్రాధాన్యం వస్తున్నది. ఇక ఎక్కడయినా పరిహారాలు పనిచేయకపోతే అక్కడ ఇంకేవో కారణాలు చెప్పి తప్పించుకోవడం జరుగుతున్నది. అంతేగాక, నాడీకూటాలు మొదలగు విషయలు మస్తుగా సరిపోయినా “కుజదోషపరిహారం" ఖచ్చితంగా లేనిచోట దాంపత్యాలు నిలవటం లేదు. కనుక "పొంతన” చూడటం అనేది “చిలక ప్రశ్న” లాగ అవుతున్నదేగాని గుండెమీద చేయివేసి గ్యారంటీగా యీ దాంపత్యం నిలబడుతుంది అని చెప్పే అవకాశం లేకుండా ఉంది.
ఈ పరిస్థితులలో ఈ కుజదోషం గూర్చి ఎవరేమి చెప్పారు? ఎంతవరకు న్యాయంగా వున్నది? ఎంతవరకు జ్యోతిషహేతుబద్ధంగా ఉ న్నది. అన్న విషయం ముందు పండితుల ముందర పెట్ట తరువాత నేను చెప్పదలచినది “టూకీ”గా చెప్పి 3వ దశలో విస్తృతంగా కారికులతో విషయాన్ని వివరిస్తాను. ఒకవేళ నా నూతన సిద్ధాంతాన్ని ఒప్పుకోని వారికయినా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ముందు ప్రాచీనకుజ దోషవిచారణను పునరుక్తులను తొలగించి గ్రంథప్రమాణాలతో వివరంగా ఇవ్వదలచాను. అసలు ఈ వ్యాపారానికి మూలగ్రంథంగా నేను "అంగారక శృంగార" అనే పేరుతో ఒక (కారికా) గ్రంథం సంస్కృతంలో వ్రాశాను. దానికి ఇంగ్లీషులో "The discovery of definite dimensions of gruiety"......................
కుజసప్తతి జ్యోతిషసోదరులకు తెలియని విషయం కాదు; కుజదోషం వ్యవహారం ఎంత జటిలమో, ఎన్ని అపజయాలను మనకు అందిస్తున్నదో, కుజదోషానికి సంబంధించి పరిహారాలు కోకొల్లలు. కాని పరిహారాలు తప్పటం, దాంపత్యాలు భగ్నం కావటం కూడా అంతే సంఖ్యలో ఉన్నాయి. అయితే పరిహారాలు కుదిరి లేదా కుదిరినట్లనిపించి జరుగుతున్న కాపురాలు గూడా చాలానే ఉన్నాయి. ఇందువలన సిద్ధాంతుల అనుభవాలు, పేరుప్రతిష్ఠలు, హస్తవాసి, వాక్ శుద్ధి మొదలగు జ్యోతిషంతో సంబంధంలేని విషయాలకు ప్రాధాన్యం వస్తున్నది. ఇక ఎక్కడయినా పరిహారాలు పనిచేయకపోతే అక్కడ ఇంకేవో కారణాలు చెప్పి తప్పించుకోవడం జరుగుతున్నది. అంతేగాక, నాడీకూటాలు మొదలగు విషయలు మస్తుగా సరిపోయినా “కుజదోషపరిహారం" ఖచ్చితంగా లేనిచోట దాంపత్యాలు నిలవటం లేదు. కనుక "పొంతన” చూడటం అనేది “చిలక ప్రశ్న” లాగ అవుతున్నదేగాని గుండెమీద చేయివేసి గ్యారంటీగా యీ దాంపత్యం నిలబడుతుంది అని చెప్పే అవకాశం లేకుండా ఉంది. ఈ పరిస్థితులలో ఈ కుజదోషం గూర్చి ఎవరేమి చెప్పారు? ఎంతవరకు న్యాయంగా వున్నది? ఎంతవరకు జ్యోతిషహేతుబద్ధంగా ఉ న్నది. అన్న విషయం ముందు పండితుల ముందర పెట్ట తరువాత నేను చెప్పదలచినది “టూకీ”గా చెప్పి 3వ దశలో విస్తృతంగా కారికులతో విషయాన్ని వివరిస్తాను. ఒకవేళ నా నూతన సిద్ధాంతాన్ని ఒప్పుకోని వారికయినా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ముందు ప్రాచీనకుజ దోషవిచారణను పునరుక్తులను తొలగించి గ్రంథప్రమాణాలతో వివరంగా ఇవ్వదలచాను. అసలు ఈ వ్యాపారానికి మూలగ్రంథంగా నేను "అంగారక శృంగార" అనే పేరుతో ఒక (కారికా) గ్రంథం సంస్కృతంలో వ్రాశాను. దానికి ఇంగ్లీషులో "The discovery of definite dimensions of gruiety"......................© 2017,www.logili.com All Rights Reserved.