ముందుమాట
'మహా' అంటే గొప్పదైన 'విద్య' అంటే స్త్రీ దేవతకు సంబంధించిన మంత్ర శాస్త్రము మొత్తం మీద 'మహావిద్య' అంటే స్త్రీ దేవతకు సంబంధించిన మంత్రశాస్త్రము. ఎవరా స్త్రీ దేవత? మహాత్రిపురసుందరి. ఈవిడ జ్ఞాన ప్రదాయిని, ముక్తిప్రదాయిని. ముక్తినిచ్చే ఆ త్రిపురసుందరికి సంబంధించిన మంత్ర యంత్ర తంత్ర రహస్యాలనే 'శ్రీవిద్య' అంటారు. 'శ్రీవిద్యను ఉపాసించిన వారికి మరుజన్మ లేదు' అని చెబుతున్నాయి గ్రంథాలు. యశ్యనో పశ్చిమం జన్మ ॥ యదివా శంకర స్వయం
తేనైవ లభ్యతే విద్యా | శ్రీమత్పంచ దశాక్షరీ ॥
అంటోంది లలితా త్రిశతి ఫలశృతి. ఎవరికైతే మరుజన్మ లేదో, ఎవరైతే సాక్షాత్తు పరమేశ్వరుడో, అటువంటి వాడికి మాత్రమే పంచదశీ మహామంత్రము లభిస్తుంది.
శ్రీవిద్యకు పంచదశి మహామంత్రము గాయత్రి వంటిది. ఈ మంత్రాన్ని ఏ కులం వారైనా, ఏ మతం వారైనా చెయ్యవచ్చు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్యుల కోసం గాయత్రీ మంత్రము ఏర్పడగా, అన్ని వర్ణాల వారి కోసం పంచదశీ మహామంత్రము చెప్పబడింది. ఈ మంత్రాన్ని జపించిన వారికి ఇహము కావాలంటే ఇహము, పరము కావాలంటే పరము లభిస్తుంది.
అయితే కొన్నిచోట్ల ఈ మంత్రాన్ని ఉపాసించిన వారు జీవించినంత కాలము లౌకిక సుఖాలనుభవించి, మరణానంతరము మోక్షం పొందుతారు. అని చెప్పబడింది. అది తప్పు. అలా జరగదు. ఇక్కడ సూత్రం ఏమంటే యత్రాపి భోగో నచ తత్ర మోక్షణ యత్రాపి మోక్షో న చ తత్ర భోగః శ్రీసుందరీ సేవనతత్పరాణాం | భోగశ్చ మోక్షశ్చ కరస్త ఏవ ॥ మోక్షం కావాలంటే భోగం ఉండదు. భోగం కావాలంటే మోక్షం ఉండదు. ఇది చాలా చిన్న విషయం. లౌకికమైన విషయాలను వదిలేస్తేనే కదా పారలౌకికం లభించేది. సంసార బంధనాల్లో కూరుకుపోయి, అదే..................
ముందుమాట 'మహా' అంటే గొప్పదైన 'విద్య' అంటే స్త్రీ దేవతకు సంబంధించిన మంత్ర శాస్త్రము మొత్తం మీద 'మహావిద్య' అంటే స్త్రీ దేవతకు సంబంధించిన మంత్రశాస్త్రము. ఎవరా స్త్రీ దేవత? మహాత్రిపురసుందరి. ఈవిడ జ్ఞాన ప్రదాయిని, ముక్తిప్రదాయిని. ముక్తినిచ్చే ఆ త్రిపురసుందరికి సంబంధించిన మంత్ర యంత్ర తంత్ర రహస్యాలనే 'శ్రీవిద్య' అంటారు. 'శ్రీవిద్యను ఉపాసించిన వారికి మరుజన్మ లేదు' అని చెబుతున్నాయి గ్రంథాలు. యశ్యనో పశ్చిమం జన్మ ॥ యదివా శంకర స్వయం తేనైవ లభ్యతే విద్యా | శ్రీమత్పంచ దశాక్షరీ ॥ అంటోంది లలితా త్రిశతి ఫలశృతి. ఎవరికైతే మరుజన్మ లేదో, ఎవరైతే సాక్షాత్తు పరమేశ్వరుడో, అటువంటి వాడికి మాత్రమే పంచదశీ మహామంత్రము లభిస్తుంది. శ్రీవిద్యకు పంచదశి మహామంత్రము గాయత్రి వంటిది. ఈ మంత్రాన్ని ఏ కులం వారైనా, ఏ మతం వారైనా చెయ్యవచ్చు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్యుల కోసం గాయత్రీ మంత్రము ఏర్పడగా, అన్ని వర్ణాల వారి కోసం పంచదశీ మహామంత్రము చెప్పబడింది. ఈ మంత్రాన్ని జపించిన వారికి ఇహము కావాలంటే ఇహము, పరము కావాలంటే పరము లభిస్తుంది. అయితే కొన్నిచోట్ల ఈ మంత్రాన్ని ఉపాసించిన వారు జీవించినంత కాలము లౌకిక సుఖాలనుభవించి, మరణానంతరము మోక్షం పొందుతారు. అని చెప్పబడింది. అది తప్పు. అలా జరగదు. ఇక్కడ సూత్రం ఏమంటే యత్రాపి భోగో నచ తత్ర మోక్షణ యత్రాపి మోక్షో న చ తత్ర భోగః శ్రీసుందరీ సేవనతత్పరాణాం | భోగశ్చ మోక్షశ్చ కరస్త ఏవ ॥ మోక్షం కావాలంటే భోగం ఉండదు. భోగం కావాలంటే మోక్షం ఉండదు. ఇది చాలా చిన్న విషయం. లౌకికమైన విషయాలను వదిలేస్తేనే కదా పారలౌకికం లభించేది. సంసార బంధనాల్లో కూరుకుపోయి, అదే..................© 2017,www.logili.com All Rights Reserved.