దశమహావిద్యలలో ప్రయోగ విద్యలు, మోక్ష విద్యలు, ఐహిక సాధన విద్యలు సంలీనమయినాయి. మాతంగి, బగళ, ధూమావతి మొదలైన విద్యలు తీవ్ర సాధనకు సంబంధించినవి. తార, భైరవి, త్రిపుర సుందరి ఈ మూడూ సాత్విక సాధనకు సంబంధించినవి. భువనేశ్వరి బీజాక్షరం మహాలక్ష్మి అష్టోత్తర నామాలలో సంలీనమయినది. కాలక్రమంలో దశమహావిద్యలను విష్ణువు దశావతారాలను సంయోజన పరచే పధ్ధతి వచ్చింది. సౌందర్య బహుళమైన రసారామ విహార శీలమైన వైష్ణవ మార్గానికి తీవ్ర సాధనాలతో కూడిన దశమహావిద్యల మార్గానికి చేయబడ్డ ఈ సమన్వయము భారతీయ సంస్కృతీలోనే కేంద్రబిందువు నుండి విస్తరిస్తూపోయే వలయాల పద్ధతిని, సమన్వయాన్ని సూచిస్తుంది. ఈ శక్తుల సాధన అంత సులభం కాకపోయినా వాటిని గూర్చిన మననం కూడా కొంతలో కొంత ఫలితాన్నిస్తుంది.
దశమహావిద్యలలో ప్రయోగ విద్యలు, మోక్ష విద్యలు, ఐహిక సాధన విద్యలు సంలీనమయినాయి. మాతంగి, బగళ, ధూమావతి మొదలైన విద్యలు తీవ్ర సాధనకు సంబంధించినవి. తార, భైరవి, త్రిపుర సుందరి ఈ మూడూ సాత్విక సాధనకు సంబంధించినవి. భువనేశ్వరి బీజాక్షరం మహాలక్ష్మి అష్టోత్తర నామాలలో సంలీనమయినది. కాలక్రమంలో దశమహావిద్యలను విష్ణువు దశావతారాలను సంయోజన పరచే పధ్ధతి వచ్చింది. సౌందర్య బహుళమైన రసారామ విహార శీలమైన వైష్ణవ మార్గానికి తీవ్ర సాధనాలతో కూడిన దశమహావిద్యల మార్గానికి చేయబడ్డ ఈ సమన్వయము భారతీయ సంస్కృతీలోనే కేంద్రబిందువు నుండి విస్తరిస్తూపోయే వలయాల పద్ధతిని, సమన్వయాన్ని సూచిస్తుంది. ఈ శక్తుల సాధన అంత సులభం కాకపోయినా వాటిని గూర్చిన మననం కూడా కొంతలో కొంత ఫలితాన్నిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.