Title | Price | |
Mantrakavatam Teristhe Mahabharatham Mana Charitre | Rs.550 | Out of Stock |
కల్పన కన్నా అద్భుతం
ఇవి యేనున్ సతతంబు నాయెడ కరం బిష్టంబులై యుండు బా
యవు భూదేవుకులాభితర్పణ మహీయః ప్రీతియున్ భారత
శ్రవణాసక్తియు బార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజామహో
త్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్
- శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం,
అవతారిక, పద్య సంఖ్య 12
బ్రాహ్మణులను సంతృప్తి పరచడం, భారతం వినడం, పరమేశ్వరుని పాదపద్మాలను ధ్యానించడం, పూజించడం, నిరంతరం దానధర్మాలు చేస్తూ ఉండడం, సాధుపురుషుల సహవాసం అనే అయిదు నాకు ఎప్పుడూ ఇష్టం కలిగిస్తూ ఉంటాయి.
“నాకు కథలంటే చాలా ఇష్ట” మన్నాననుకోండి, “కథలంటే ఎవరికి ఇష్టముండ”దని మీరు వెంటనే అనచ్చు. నిజమే, కథలను ఇష్టపడనివారు ఉండరు. కనుక, చిన్నపాటి ఆత్మకథకు ఉపక్రమణికగానే ఈ వాక్యాన్ని తీసుకోవాలని మనవి.
కథలంటే తనకు ఎంత ఇష్టమంటే, నన్నయభట్టు తనతో రాజరాజ నరేంద్రుడు అన్నట్టుగా చెప్పిన పైపద్యం నాకు తరచు గుర్తొస్తుంటుంది.
అయిదు విషయాలు తనకు చాలా ఇష్టమైనవంటూ, రాజరాజనరేంద్రుడు అవేమిటో చెప్పాడు. వాటిలో భారతశ్రవణాసక్తి ఒకటి. ఆ మాట నన్నయ...........
కల్పన కన్నా అద్భుతం ఇవి యేనున్ సతతంబు నాయెడ కరం బిష్టంబులై యుండు బా యవు భూదేవుకులాభితర్పణ మహీయః ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు బార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజామహో త్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్ - శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం, అవతారిక, పద్య సంఖ్య 12 బ్రాహ్మణులను సంతృప్తి పరచడం, భారతం వినడం, పరమేశ్వరుని పాదపద్మాలను ధ్యానించడం, పూజించడం, నిరంతరం దానధర్మాలు చేస్తూ ఉండడం, సాధుపురుషుల సహవాసం అనే అయిదు నాకు ఎప్పుడూ ఇష్టం కలిగిస్తూ ఉంటాయి. “నాకు కథలంటే చాలా ఇష్ట” మన్నాననుకోండి, “కథలంటే ఎవరికి ఇష్టముండ”దని మీరు వెంటనే అనచ్చు. నిజమే, కథలను ఇష్టపడనివారు ఉండరు. కనుక, చిన్నపాటి ఆత్మకథకు ఉపక్రమణికగానే ఈ వాక్యాన్ని తీసుకోవాలని మనవి. కథలంటే తనకు ఎంత ఇష్టమంటే, నన్నయభట్టు తనతో రాజరాజ నరేంద్రుడు అన్నట్టుగా చెప్పిన పైపద్యం నాకు తరచు గుర్తొస్తుంటుంది. అయిదు విషయాలు తనకు చాలా ఇష్టమైనవంటూ, రాజరాజనరేంద్రుడు అవేమిటో చెప్పాడు. వాటిలో భారతశ్రవణాసక్తి ఒకటి. ఆ మాట నన్నయ...........© 2017,www.logili.com All Rights Reserved.